Sunday, June 15, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఇంటర్నేషనల్ జిల్లా చైర్మన్ ఫర్ విజన్ గా లయన్స్ గూడూరు మోహన్దాస్ ఎంపిక

ఇంటర్నేషనల్ జిల్లా చైర్మన్ ఫర్ విజన్ గా లయన్స్ గూడూరు మోహన్దాస్ ఎంపిక

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని లయన్స్ క్లబ్ లో విశేష సేవలు అందించిన లయన్స్ క్లబ్ గూడూరు మోహన్ దాస్ లో గుంతకల్ లయన్స్ ఇంటర్నేషనల్ కార్యాలయము వారు ఇంటర్నేషనల్ డిస్టిక్ చైర్మన్ ఫర్ విజన్ గా ఎంపిక చేయడం జరిగిందని పీఎంయు ఎఫ్ లయన్ ఇల్లూరు గోపాలకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఇల్లూరు గోపాలకృష్ణ మాట్లాడుతూ గూడూరు మోహన్ దాస్ 1990వ సంవత్సరము నుండి మూడుసార్లు లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా, ఒకసారి జోనల్ చైర్మన్గా, ఒకసారి రీజినల్ చైర్మన్గా, మరొక్కసారి అసోసియేషన్ గవర్నర్గా, పది సంవత్సరాలు జిల్లా చైర్మన్గా ఎంపిక కావడంతో లైన్స్ క్లబ్ కు మంచి గుర్తింపుతో పాటు, పేద ప్రజలకు కంటి ఆపరేషన్లు చేయించడంలో మంచి ప్రతిభను కనపరచడం జరిగిందన్నారు. వారి సేవలను గుర్తించి , ఇంటర్నేషనల్ రికగ్నైజ్డ్ డిస్టిక్ చైర్మన్ ఫర్ విజన్ గా ఎంపిక చేయడం జరిగిందన్నారు. వీరు 2025 జూలై నెల నుండి 2026 జూలై నెల వరకు (ఒక సంవత్సరం పాటు) పదవిలో ఉంటారని తెలిపారు. వీరి హయాంలో ప్రజలకు కంటి ఆపరేషన్ పట్ల, కంటి జాగ్రత్తలు పట్ల అవగాహన కల్పిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తదుపరి గూడూరు మోహన్ దాస్ మాట్లాడుతూ తాను లైన్స్ క్లబ్ కు సేవకుడిగా మాత్రమే పని చేశానని, నా విధులు నన్ను ఇంతటి స్థాయికి చేరుకోవడం జరిగిందని తెలిపారు. పేద ప్రజలకు కంటి పట్ల, కంటి ఆపరేషన్ పట్ల అవగాహన కల్పించడం లో మరింత బాధ్యత పెరిగిందని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. నా జీవితాంతం లయన్స్ క్లబ్బుకు సేవలు అందిస్తానని వారు స్పష్టం చేశారు. గత 20 సంవత్సరాలుగా ధర్మవరం పట్టణంలోని ఎర్రగుంట లో గల కంటి ఆసుపత్రి కార్యాలయంలో మేనేజింగ్ డైరెక్టర్ గా తాను పనిచేస్తున్నానని, నా జీవితాంతం కూడా సేవలు అందిస్తానని వారు తెలిపారు. తదుపరి లయన్స్ క్లబ్ కమిటీ వారు మోహన్దాస్కు కృతజ్ఞతలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు