న్యూయార్క్: బ్రూక్లిన్‌లోని యూదుల పాఠశాలలో జాత్యహంకార రాతలను న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికైన జొహ్రాన్ మమ్దానీ తీవ్రంగా ఖండిరచారు. న్యూయార్క్‌లో యూదుల వ్యతిరేకతకు స్థానం లేదన్నారు. జాత్యహంకారాన్ని నిర్మూలించేలా పనిచేస్తానంటూ ఐక్యతా సందేశమిచ్చారు. నగర మేయర్‌గా యూదులకు అండగా నిలుస్తానన్నారు. ఈమేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టారు. మంగళవారం జరిగిన ఎన్నికల్లో డెమొక్రాట్ పార్టీ చారిక్రత గెలుపు తర్వాత ఈ ఘటన జరగడం చర్చకు దారితీసింది. మెక్‌డొనాల్డ్ అవెన్యూలోని మాగెన్ డేవిడ్ యోషివా పాఠశాలలో పిల్లర్లు, కిటికీలపై ఎరుపు రంగులో స్వస్తిక్ ముద్రను గుర్తించినట్లు అక్కడి సిబ్బంది తెలిపారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే నిందితుడు పరారీలో ఉన్నాడని సమాచారం.
జాత్యహంకారాన్ని సహించం: మమ్దానీ
- Advertisement -
RELATED ARTICLES


