రష్యా విప్లవం 1917 లో మహత్తర విజయం సాధించింది. ఆనాడు రష్యా రాజకీయ చిత్రాన్ని అంత తేలికగా వూహించలేని పరిస్థితి. ఈ మహత్తర విప్లవం వివిధ ఖండాలలో విభ్రాంతి కలిగించే అలలను సృష్టించింది. శతాబ్దాలుగా వలసవాద రాజ్యాల పునాదులు కదిలిపోయాయి. ఆ కాలంలో మానవాళి విదేశీ పాలనలో లేదా సామ్రాజ్యవాదుల ఆధిపత్యంలో నివసించింది. అప్పుడు స్వాతంత్య్రం, విముక్తి, సమానత్వం కోసం పెట్రోగ్రాడ్ వీధుల్లో జరిగిన విప్లవ పోరాటానికి మించి ఈ విప్లవ పోరాటంలో పాల్గొనాలని గొప్ప పిలుపునివ్వడం జరిగింది. వలసవాద ప్రపంచం బలహీనమైన స్పర్శ నాడిని తాకింది. 1900 ప్రారంభ దశాబ్దిలలో ఐరోపా వలస పాలన 80 శాతం ప్రాంతంలో విస్తరించింది. వలస పాలన ఆధిపత్యం తెలియజేసేది ఏమిటంటే ప్రపంచ జనాభాలో అత్యధికులు అణచివేతకు బలవంతంగా లోనైన ప్రాంతంలో జీవిస్తున్నారు. ఆఫ్రికా, కరేబియన్ ప్రాంతాల అంతటా అనేక మిలియన్ల ప్రజలు బానిసత్వంలో ఉన్నారు. ఆ కాలంలో రష్యా విప్లవం భూకంపం వలేె ప్రపంచాన్ని వణికించింది. ప్రాచీన పాలన తల్లకిందులైంది. అంతేకాదు అణగారిన వర్గాల ప్రజలకు గొప్ప ఆశాభావనను కల్పించాయి. ఇదే సమయంలో విప్లవం లోతైన ప్రతిధ్వని ఇచ్చింది. అంతేకాదు విదేశీ పాలనకే గాక, వారసత్వంగా వస్తున్న నిర్మాణాలు కేవలం వలసవాద ప్రాంతాలలో పెరుగుతున్నాయి. ఇండియాలో అనేక దశాబ్దాల పాటు బ్రిటీషు పాలనలో ఉండటం కేవలం ఆర్థిక దోపిడీ కోసం మాత్రమే కాదు, మానవ శ్రమను దోచుకున్నారు. పురుషాధిపత్య వ్యవస్థలో కులం, మతం మధ్య తీవ్ర ఘర్షణలను బ్రిటీషు పాలకులు సృష్టించి, పెంచారు.
వలస పాలన చేస్తున్న విదేశీ పాలకులపై ఇండియా ప్రజల గుండెల్లో తీవ్ర ఆగ్రహం పెల్లుబికింది. కులం అణచివేత, వివక్ష, హింస దేశంలో కొనసాగింది. మన రిపబ్లిక్లో ఇదొక మచ్చలాగా ఉండిపోయింది. 2023 నివేదిక ప్రకారం, జాతీయ నేరాల నమోదు బ్యూరో (ఎన్సీిఆర్బీ) వెల్లడిరచిన మేరకు 2023లోనే 57,789 మంది షెడ్యూల్డు కులాల (ఎస్సీలు) ప్రజలు నేరాలు చేశారని కేసులు నమోదు చేశారు. ఎస్సీలపై నేరస్థులుగా పరిగణించి ప్రతి సంవత్సరం నేరస్థ కేసులు నమోదు చేస్తున్నారు. ఎస్టీలపై 2022లో 28.8 శాతం మందిపై నేరాలు మోపి కేసులు నమోదు చేయగా, 2023లో 12,960 మందిపై కేసులు నమోదు చేశారు. ఎస్సీలు, ఎస్టీలపై అణచివేతలు పెరుగుతున్నాయి. మన సమాజంలో వలస పాలన ముందుగానే ముగిసిపోవలసింది. అయితే అణచివేత, అంటరానితనం, కుల వివక్ష, హింస కొనసాగడం వల్ల దేశ విముక్తి ఆలస్యమైంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్గవాయ్పై లాయరు బూటు విసరడం ఎందుకు? న్యాయమూర్తి దళితుడు గనుకనే ఇది జరిగింది. సనాతన ధర్మాన్ని పాటించాలని లాయరు అన్నారు. మితవాద ఫాసిస్టు శక్తులు ఇలాంటి తుచ్చమైన చర్యలకు పూనుకుంటున్నారు.
గిరిజనుల హక్కులను హరించారు. వారికి చెందిన వనరులను కార్పొరేట్లు దోచుకొని అపారమైన లాభాలు పొందుతున్నారు. వలస పాలన రోజుల్లో ఇదే పరిస్థితి. ఆదివాసీల భూములను ఆక్రమించుకొని వారికి విముక్తి లేకుండా చేశారు. వారి భూములను ఆక్రమించుకొని అడవులను నాశనం చేశారు. ఇలాంటి ఘటనలు ఎక్కడో ఒకచోట జరగలేదు. హింసాయుత ఘటనలు ప్రతిరోజూ జరుగుతూనే ఉన్నాయి. అడవులు ఏ పంటలు లేని ఖాళీ భూములుగా తయారయ్యాయి. అణగారిన వర్గ ప్రజలను ఎక్కువగా అణచివేస్తున్నారు. అణచివేత ఒక విధానం ప్రకారం జరుగుతోంది. ఈ దుర్మార్గాలను ప్రశ్నించిన వారిని నక్సలైట్లు, మావోయిస్టులని ముద్ర వేసి కార్పొరేట్ల అభివృద్ధికి పాలకులు నిత్యం తోడ్పడుతున్నారు. మహిళలకు వ్యతిరేకంగా హింసను ప్రోత్సహిస్తున్నారు. పితృస్వామిక సమాజంలో మహిళలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. సంప్రదాయాలు సాంస్కృతిక మితవాద భావజాలాన్ని ప్రచారం చేస్తూ అసమానతలను పెంచుతున్నారు. 2023 లో 4.48 లక్షల నేరాలను మహిళలు చేశారని వారిపై నేరాల మోపి కేసులు బనాయిస్తున్నారు. ప్రపంచంలో సగం మానవాళి పూర్తి పౌరసత్వానికి, స్వతంత్రతకు పోరాడుతున్నారు. న్యాయం సమానత్వం సంఫీుభావం కంటే మతానికి ప్రాధాన్యతను ఇస్తున్నారు. భారతదేశంలో ప్రజలందరికీ సమానత్వాన్ని, సౌభ్రాతృత్వాన్ని కల్పిస్తూ రాజ్యాంగాన్ని రచించారు. అయితే నేడు ఆ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు. ఆర్ఎస్ఎస్, సంఘపరివార్, బీజేపీ రాజ్యాంగానికి విలువ ఇవ్వటం లేదు. ఈ అణచివేత సంస్ధలో ఏమాత్రం అంగీకరించడం లేదు. ఫాసిస్టు మత శక్తులకు ఫాసిస్టు ఎజెండా బలంగా ఉంది. మైనారిటీలకు రక్షణ లేదు. ప్రజాస్వామ్యాన్ని మత శక్తుల గుప్పిట పెట్టుకున్నాయి. ఇది సమాజానికి, దేశానికి అత్యంత ప్రమాదకరం. సామాజిక వివక్ష అన్ని వర్గాలకు, కులాలకు, మతాలకు కొనసాగుతున్నది. అత్యధిక వర్గాలకు ఆర్థిక వృద్ధి బోలుగా ఉన్న ప్రచారమే. ప్రజాస్వామ్యం అనేది అణగారిన వర్గాలు సమాన హక్కులను పొందడం లేదు. ఈ నేపథ్యంలో హక్కులను హరించే శక్తులను ప్రతిఘటించి ఐక్యంగా ఓడిరచాలి. రష్యా విప్లవం విజయవంతం కావడం కేవలం ఒక దేశానికి పరిమితమైంది కాదు. ఆ దేశంలో సమానత్వం హక్కు అయింది. రష్యా విప్లవం చరిత్రాత్మక పాఠం అయింది. భారత కమ్యూనిస్టు పార్టీ దేశ వ్యాప్తంగా నిరసనలకు,ప్రజలందరినీ నవంబర్ 18 న ప్రజా సమీకరణకు, సామాజిక న్యాయం , సమానత్వం సాధనకు పూనుకోవాలని పిలుపునిచ్చింది. మైనారిటీలను. అణగారిన వర్గాల ప్రజలను లక్ష్యంగా పెట్టుకుని మహిళలపై హింసకు పూనుకుంటున్నారు. పౌరులందరు కులం, వర్గం, మతంతో నిమిత్తం లేకుండా అందరికీ గౌరవం, హక్కులు ఉండాలి. రాజ్యాంగం ఇచ్చిన సమానత్వాన్ని కాపాడుకోవాలి. ఫాసిజాన్ని అంతం చేయాలి. విప్లవం ఎల్లవేళలా కొనసాగాలి.
సమానత్వం ముట్టడిలో, ప్రజాస్వామ్యం ప్రమాదంలో
- Advertisement -


