Homeఅంతర్జాతీయంమునీర్‌ అత్యంత క్రూర నియంత: ఇమ్రాన్‌ ఖాన్‌

మునీర్‌ అత్యంత క్రూర నియంత: ఇమ్రాన్‌ ఖాన్‌

- Advertisement -

పెషావర్‌: పాకిస్థాన్‌ సైన్యాధికారి అసీమ్‌ మునీర్‌ ఆ దేశ చరిత్రలోనే అత్యంత క్రూరమైన నియంతగా మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ విమర్శించారు. ఆయనను మానసిక స్థిరత్వం లేని వ్యక్తిగా ఎక్స్‌ మాధ్యమంగా పీటీఐ అధినేత వ్యాఖ్యానించారు. మునీర్‌ పాలనలో అణచివేత గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో ఉందన్నారు. అధికార కోసం ఆయన ఎంతకైనా తెగిస్తారని ఇమ్రాన్‌ దుయ్యబట్టారు. మురిడ్కే ఘటనలను అధికార దుర్వినియోగానికి స్పష్టమైన ఉదాహరణలన్నారు. భద్రతా సిబ్బంది తమ పార్టీ కార్యకర్తలను హత్య చేశారని ఆరోపించారు. నిరాయుధులైన పౌరులపై విచక్షణారహితంగా కాల్పులు జరపడం ఏ నాగరిక సమాజంలోనూ ఊహించలేమని ఇమ్రాన్‌ ఖాన్‌ అన్నారు. మహిళలపై ఇంతటి క్రూరత్వం గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. తన భార్య బుష్రా బీబీని ఏకాంత నిర్బంధంలో ఉంచి ఆమెను మునీర్‌ వేధిస్తున్నారని, బానిసత్వం కంటే మరణమే మేలని ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యాఖ్యానించారు. ఏ రాజకీయ నాయకుడి కుటుంబం ఇంతటి క్రూరత్వాన్ని ఎదుర్కోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. తలవంచను, లొంగిపోను అంటూ స్పష్టంచేశారు. సయోధ్య ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.కీలుబొమ్మ ప్రభుత్వంతో, సైనిక నాయకత్వంతో తమ పార్టీ చర్చలు జరపబోదన్నారు.ఇమ్రాన్‌ ఖాన్‌ 2023 ఆగస్టు నుంచి అదియాలా జైలులో ఉన్న విషయం విదితమే.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు