Homeఅంతర్జాతీయం7 కాదు 8 విమానాలు కూలాయి

7 కాదు 8 విమానాలు కూలాయి

- Advertisement -

. భారత్‌`పాక్‌ మధ్య శాంతి నెలకొల్పా…
. 60 సార్లకుపైగా చెప్పుకున్న ట్రంప్‌

న్యూయార్క్‌: భారత్‌పాకిస్థాన్‌ మధ్య యుద్ధాన్ని ఆపినట్లు పదేపదే చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా మరొక ప్రకటన చేశారు. మే నెలలో జరిగిన ఈ యుద్ధంలో కూలిన విమానాల సంఖ్య ఏడు కాదు ఎనిమిది అని చెప్పారు. అయితే అవి ఏ దేశానివో ట్రంప్‌ చెప్పలేదు. ఫ్లోరిడాలోని మియామీలో అమెరికా బిజినెన్‌ ఫోరం సందర్భంగా భారత్‌పాక్‌ యుద్ధం గురించి ఆయన ప్రస్తావించారు. ‘నేను భారత్‌, పాకిస్థాన్‌ దేశాలతో వాణిజ్య ఒప్పందం చేసుకునే క్రమంలో వాటి మధ్య యుద్ధం జరుగుతున్నట్లు తెలిసింది. అప్పట్లో ఏడు విమానాలను కూల్చివేశారు. ఎనిమిదో విమానం బాగా దిగ్బన్నది. అంటే ఎనిమిది విమానాలు ధ్వంసమయ్యాయి’ అని అన్నారు. యుద్ధం ఆపకపోతే వాణిజ్య ఒప్పందం ప్రసక్తే లేదని చెప్పడం వల్లనే అణ్వస్త్రాలు కలిగివున్న ఇరుగుపొరుగు దేశాలు శాంతించాయన్నారు. తాను బెదిరించిన మరుసటి రోజే అక్కడ నుంచి సంధి జరిగిందంటూ ఫోన్‌ ద్వారా సమాచారం అందిందన్నారు. కృతజ్ఞతలు చెప్పి వాణిజ్యం చేద్దామని చెప్పినట్లు తెలిపారు. సుంకాలు లేకపోతే ఇది సాధ్యమయ్యేదా అని ట్రంప్‌ అన్నారు. ఎనిమిది నెలల్లో ఎనిమిది యుద్ధాలు ఆపాను... ఇందులో దీర్ఘకాలంగా సాగుతున్న కొసోవాసెర్బియా, కాంగోర్వాండా యుద్ధాలున్నాయి. 3238 ఏళ్లుగా ఆయా దేశాలు ఘర్షణ పడుతుంటే ఐక్యరాజ్య సమితి సహకారం అందించలేదు. అమెరికా ప్రపంచ శాంతికి కట్టుబడి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా శాంతి నెలకొల్పుతోంది. మమ్మల్ని ఎవరూ ఎదిరించలేరు కాబట్టే మా మాట చెల్లుతోంది’ అని ట్రంప్‌ తెలిపారు. ఇటీవల చైనా, జపాన్‌, మలేసియాతో చేసుకున్న ఒప్పందాలను ప్రస్తావిస్తూ అవి గొప్ప ఆర్థిక ఒప్పందాలని అన్నారు. భారత్‌`పాక్‌ యుద్ధం ఆపినట్లు ట్రంప్‌ 60 సార్లు చెప్పారు కానీ ఆయన జోక్యాన్ని భారత్‌ తోసిపుచ్చింది.
న్యూయార్క్‌లో సార్వభౌమత్వం కోల్పోయాం
న్యూయార్క్‌ మేయర్‌గా జొహ్రాన్‌ మమ్దానీ ఎన్నిక డొనాల్డ్‌ ట్రంప్‌కు కోపం తెప్పించింది. స్వయంగా ప్రచారం చేసినా మమ్దానీ గెలవడంతో ఆయన ఆవేశంగా మాట్లాడారు. న్యూయార్క్‌లో సార్వభౌమత్వాన్ని కోల్పోయామన్నారు. కమ్యూనిస్టు భావజాలం కలిగిన వ్యక్తి మేయర్‌ కావడంతో న్యూయార్క్‌ ప్రజల పరిస్థితి అధోగతే అంటూ హెచ్చరించారు. కమ్యూనిస్టు దేశం క్యూబా, సోషలిస్టు దేశం వెనిజులా వలే న్యూయార్క్‌ మారుతుందని, ప్రజలు ఫ్లోరిడా వెళ్లిపోవాల్సిందేనని ట్రంప్‌ అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు