Homeఅంతర్జాతీయంటర్కీ పార్లమెంటులో రభస

టర్కీ పార్లమెంటులో రభస

- Advertisement -

కొట్టుకున్న అధికార, ప్రతిపక్ష ఎంపీలు

అంకారా: టర్కీ పార్లమెంట్ రణరంగంగా మారింది. ప్రజాప్రతినిధులు వీధి రౌడీల్లా కొట్టుకున్నారు. పిడిగుద్దులు గుద్దుకుంటూ…తన్నుకుంటూ నానా రభస చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఇస్తాంబుల్ చీఫ్ ప్రాసిక్యూటర్ అకిన్ గుర్లెక్ పార్లమెంట్‌లో న్యాయశాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతుండగా ప్రతిపక్ష ఎంపీలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అధికార-ప్రతిపక్ష ఎంపీలు పరస్పర దాడులకు తెగబడ్డారు. ఒకరినొకరు గుద్దుకుంటూ, తన్నుకుంటూ కనిపించారు. చాలా సేపు ముష్టి యుద్ధం జరిగింది. ఇస్తాంబుల్ చీఫ్ ప్రాసిక్యూటర్‌గా గుర్లెక్… ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన రిపబ్లికన్ పీపుల్స్ పార్టీకి చెందిన అనేక మంది సభ్యులపై ఉన్నత స్థాయి విచారణలకు నేతత్వం వహించారు.
ప్రతిపక్షం చాలా కాలంగా ఈ విచారణలను రాజకీయంగా ప్రేరేపించబడ్డాయని విమర్శిస్తోంది. ఇప్పుడు టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్… అకిన్ గుర్లెక్‌ను న్యాయ మంత్రిగా నియమించారు. ఆయన ప్రమాణ స్వీకారం చేస్తుండగా ప్రతిపక్ష సభ్యులు ఆగ్రహంతో రెచ్చిపోయారు. ప్రతిపక్ష రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ నియంత్రణలో ఉన్న మునిసిపాలిటీలకు చెందిన వందలాది మంది అధికారులను అవినీతి దర్యాప్తులో అరెస్టు చేశారు. వీరిలో ఇస్తాంబుల్ మేయర్ ఎక్రెమ్ ఇమామోగ్లు కూడా ఉన్నారు. ఆయనను గత సంవత్సరం అరెస్టు చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు