బ్రసిలియా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలను బ్రెజిల్ ప్రజలు తిరస్కరిస్తున్నారు. సుంకాలు పెంచడం, తమ దేశంపై ఆంక్షలు విధించడంపై నిరసన గళం వినిపిస్తున్నారు. ఈనెల 1 నుంచి బ్రెజిల్ వ్యాప్తంగా ప్రజాందోళనలు మిన్నంటాయి. సార్వభౌమత్వంపై రాజీ లేదన్న నినాదాలు మార్మోగాయి. ఇదే క్రమంలో దేశంలోని ప్రధాన నగరా ల్లోగల అమెరికా కాన్సులేట్లను నిరసన కారులు ముట్టడిరచారు. బ్రెజిల్‌లో అమెరికా రాయబార కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. సుంకాలను అస్త్రంగా మల్చుకొని బ్రెజిల్ సార్వభౌమత్వాన్ని, న్యాయప రమైన స్వయంప్రతిపత్తిని దెబ్బతీసేం దుకు అమెరికా యత్నిస్తోందని బ్రెజిల్ ప్రజలు ఆరోపించారు. మాజీ అధ్యక్షుడు బొల్సనారోకు మద్దతుగా తమ దేశంపై కక్షసాదింపునకు ట్రంప్ పాల్పడటాన్ని ఎండగట్టారు. బోల్సనా రోతో పాటు ట్రంప్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. భారీ బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు. బ్రెజిల్ ఉత్పత్తులపై 50 శాతం వరకు సుంకాలను అమెరిరా ప్రకటించింది. మాజీ అధ్యక్షుడు బోల్సనారో కేసును విచారించే బ్రెజిల్ ఫెడరల్ సుప్రీం కోర్టు న్యాయమూర్తి అలెగ్జాండర్ డే మొరేల్స్‌పై ఆంక్షలు విధించింది. అమెరికా తన వాణిజ్య భాగస్వామ్య దేశాలన్నింటికంటే బ్రెజిల్‌పైనే అత్యధిక సుంకాలు ప్రకటించింది. అధికారాన్ని దుర్వినియోగిస్తున్నట్లు బ్రెజిల్ సర్వోన్నత న్యాయ వ్యవస్థను ట్రంప్ విమర్శించారు. బోల్సనారోపై విచారణ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామాలతో బ్రెజిల్ అధ్యక్షుడు లులా డా సిల్వా అమెరికా తీరును ఆక్షేపించారు. బ్రెజిల్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యాన్ని తీవ్రంగా ఖండిరచారు. దేశ ప్రయోజనాల కంటే విదేశీ పొత్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారంటూ ప్రతిపక్షాన్ని ముఖ్యంగా బోల్సనారో కుటుంబాన్ని దుయ్యబట్టారు. బోల్సనారో వ్యవహారాల్లో విదేశీ జోక్యాన్ని ప్రతిఘటిస్తామన్నారు. ఇదిలావుంటే, బోల్సనారోకు మద్దతు తెలుపుతూ ప్రజలు కొందరు అనేక నగరాల్లో సుప్రీం ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి మోరేస్, అధ్యక్షుడు లులా డా సిల్వాకు వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహించారు.
ట్రంప్ సుంకాలు, ఆంక్షలకు వ్యతిరేకంగా బ్రెజిల్‌లో ప్రజాందోళనలు
- Advertisement -
RELATED ARTICLES


