Homeతమిళనాట సీపీఐకి ఐదు స్థానాలు

తమిళనాట సీపీఐకి ఐదు స్థానాలు

- Advertisement -

23 సీట్లలో కాంగ్రెస్ పోటీ

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ ఐదు స్థానాల్లో పోటీ చేయనున్నది. ఈ మేరకు డీఎంకేతో ఒప్పందం కుదిరింది. సీట్ల సర్దుబాటుపై చర్పోచర్చల అనంతరం ఏకాభిప్రాయం కుదిరింది. ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీకి భారత కమ్యూనిస్టు పార్టీ అంగీకరించింది. సీట్ల పంపకం ఒప్పందంపై డీఎంకే అధినేత, సీఎం ఎంకే స్టాలిన్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎం.వీరపాండియన్ సంతకాలు చేశారు. ఈ మేరకు డీఎంకే బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అనంతరం వీరపాండియన్ విలేకరులతో మాట్లాడారు. టీఆర్ బాలు నాయకత్వంలో సీట్ల సర్దుబాటు ప్యానల్‌తో చర్చలు జరిగాయని, కూటమిలో కొత్త పార్టీల చేరిక కారణంగా తక్కువ స్థానాల్లో పోటీకి అంగీకరించాలని డీఎంకే విజ్ఞప్తి చేసిందని వీరపాండియన్ తెలిపారు. అన్ని స్థానాల్లో సీపీఐ సహకారాన్ని స్టాలిన్ కోరారని చెప్పారు. వారి విజ్ఞప్తి మేరకు ఐదు స్థానాల నుంచి పోటీకి సీపీఐ అంగీకరించిందని వీరపాండియన్ వెల్లడించారు. ఈ ఎన్నికల్లో బీజేపీని, దాని కూటమిని ఓడించడమే సీపీఐ ప్రాధమిక ఉద్దేశమని ఆయన చెప్పారు. గతంలో కంటే సన్నిహితంగా ఉండటం వల్ల ప్రత్యర్థిని ఓడించగలమని స్టాలిన్‌తో చెప్పినట్లు తెలిపారు. 2021 ఎన్నికల్లో సీపీఐ ఆరు స్థానాల్లో పోటీ చేయగా, రెండు చోట్ల గెలిచింది. అటు కాంగ్రెస్ కూడా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలను ఖరారు చేసింది. కూటమిలో భాగంగా సీట్ల సర్దుబాటుకు అంగీకరించింది. 28 స్థానాల నుంచి పోటీకి అంగీకరించింది. కాంగ్రెస్‌కు రాజ్యసభ స్థానాన్ని సైతం డీఎంకే కేటాయించింది. మరో భాగస్వామి ఎండీఎంకే నాలుగు స్థానాల్లో పోటీ చేయనుంది.
మొత్తం 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 23న ఎన్నికలు జరుగుతాయి. ఓట్ల లెక్కింపు మే 4న జరుగుతుంది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. డీఎంకే నేతత్వ లౌకిక ప్రగతిశీల కూటమి (ఎస్‌పీఏ)కి అన్నాడీఎంకే నేతత్వ జాతీయ ప్రజాస్వామిక కూటమి (ఎన్డీయే)కి మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ఈ ఎన్నికలతో రాజకీయ అరంగేట్రానికి నటుడు` తమిళగ వెట్రి కజగం (టీఎంకే) అధినేత విజయ్ సిద్ధమయ్యారు. 2021 ఎన్నికల్లో డీఎంకే 133 స్థానాలు గెలుచుకోగా, అన్నాడీఎంకే 66 స్థానాలు, కాంగ్రెస్ 18 స్థానాలు గెలుచుకున్నాయి. 76.6 శాతం పోలింగ్ నమోదైంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు