విశాలాంధ్ర – ధర్మవరం : తెలుగు ఆత్మగౌరవానికి వన్నెతెచ్చిన వారు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు అని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలను టిడిపి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. టిడిపి కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా సంక్షేమ పథకాలను వేద ప్రజలకు అందించిన గొప్ప నాయకుడు అని తెలిపారు. కేవలం 9 నెలలోనే పార్టీని స్థాపించి అధికారాన్ని చేపట్టి కాంగ్రెస్ పార్టీని కూకటివేలతో సహా వికరించిన మహనీయుడు అని తెలిపారు. పేదలకు కూడు గూడు గుడ్డ నినాదంతో ఎన్నో సంక్షేమ పథకాలను అందించి పేదల హృదయాలలో గూడు కట్టుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు చింతపులుసు పెద్దన్న, రాళ్లపల్లి షరీఫ్, చీమల రామాంజి, అడ్ర మహేష్, రేనాటి సీనా, లక్ష్మీనారాయణ, పఠాన్ బాబు ఖాన్, రామకృష్ణ, మహిళా నాయకురాలు ముత్తుకూరు బిబి, కత్తులు సునీత, సునంద, మున్ని తదితరులు పాల్గొన్నారు.
తెలుగు ఆత్మగౌరవానికి వన్నెతెచ్చిన ఎన్టీఆర్ : తెలుగుదేశం పార్టీ నాయకులు
RELATED ARTICLES