Wednesday, July 2, 2025
Homeఅంతర్జాతీయంత్వరలో భారత్‌తో పెద్ద ఒప్పందం

త్వరలో భారత్‌తో పెద్ద ఒప్పందం

చైనాతో కుదిరిన కీలక ఒప్పందం : ట్రంప్‌
వాషింగ్టన్‌: చైనాతో ‘రేర్‌ ఎర్త్‌ ఎక్స్‌పోర్ట్స్‌’ ఒప్పందం కుదిరిందని, సంతకాలు కూడా జరిగాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. అరుదైన ఒప్పందం ద్వారా తమ రెండు దేశాల మధ్య సంబంధాలు చక్కబడతాయని ఆకాంక్షించారు. త్వరలోనే భారత్‌ను మరొక పెద్ద ఒప్పందాన్ని అమెరికా చేసుకోనుందన్నారు. అయితే అది ఏమిటో చెప్పలేదు. అమెరికా వాణిజ్య శాఖ కార్యదర్శి హావర్డ్‌ లుట్నిక్‌ ‘బ్లూమ్‌బర్గ్‌ టీవీ’తో మాట్లాడుతూ ఈ వారం ఆరంభంలోనే చైనా ఒప్పందం ఖరారైంది. అధ్యక్షుడికి ఇలాంటి ఒప్పందాలు చేయడం ఇష్టం. ఆయనే స్వయంగా సంబంధిత ప్రక్రియను పర్యవేక్షిస్తారు’ అని అన్నారు. ఒప్పందం వివరాలను ఆయన వెల్లడిరచలేదు. మేలో జెనీవాలో అమెరికా`చైనా మధ్య చర్చల ద్వారా ఇది సాధ్యమైందని అధికార వర్గాలు తెలిపాయి. కాగా, కొత్త టారిఫ్‌ల అమలు క్రమంలో చైనాతో వాణిజ్య యుద్ధం నేపథ్యంలో తాజా పరిణామం చర్చకు దారితీసింది. ఇలా అన్ని దేశాలతో ఒప్పందాలు చేసుకోబోమని ట్రంప్‌ స్పష్టంచేశారు. చైనా, భారత్‌తో సంబంధాలు చక్కబెట్టుకుంటున్నట్లు తెలిపారు. ‘మేము అందరితో ఒప్పందాలు చేసుకోం. కొన్ని దేశాలకు లేఖలు పంపి కృతజ్ఞతలు తెలుపుతాం. 25, 35, 45 శాతం చొప్పున చెల్లించాలని చెబుతాం. ఇదే సులభమైన పద్ధతి కానీ మా వాళ్లు సాధ్యమైనన్ని ఒప్పందాలు చేసుకోవాలని, ఇందులో నన్ను మించిపోవాలని కోరుకుంటున్నారు. మంచి ఒప్పందాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం చైనాతో చక్కటి ఒప్పందం జరిగింది. త్వరలో భారత్‌తోనూ పెద్ద ఒప్పందం జరగనుంది’ అని ట్రంప్‌ తెలిపారు. అయితే ఆ ఒప్పందాల గురించి ఎలాంటి వివరాలను అమెరికా అధ్యక్షుడు వెల్లడిరచలేదు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు