గోదావరికి పెరుగుతున్న వరద ప్రవాహం
అప్రమత్తమైన జలవనరుల శాఖ
దేవీపట్నం నుంచి పాపికొండల విహారయాత్ర నిలుపుదల చేసిన అధికారులు
గోదావరి నదిలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. గత ఐదు రోజులుగా ఎగువ ప్రాంతాల్లో, అలాగే ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి ఉప నదులు, కొండవాగులు ఉప్పొంగి గోదావరిలో కలుస్తున్నాయి. దీనితో నీటిమట్టం పెరుగుదల కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే నుండి 49 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరిలో నీటిమట్టం పెరుగుతున్న దృష్ట్యా జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అల్లూరి జిల్లాలోని దేవీపట్నం నుంచి పాపికొండల విహార యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. దేవీపట్నం మండలం దండంగి, డి. రావిలంక గ్రామాల మధ్య ఆర్ అండ్ బీ రహదారిపై గోదావరి వరద ప్రవాహం పెరిగింది. దీనితో గండి పోచమ్మ ఆలయం వైపు రాకపోకలు నిలిచిపోయాయి.
గోదావరికి భారీగా వరద ప్రవాహం .. పాపికొండల విహార యాత్రలకు బ్రేక్
RELATED ARTICLES