పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఆయన షూటింగ్ షెడ్యూల్స్‌పై నెలకొన్న సందిగ్ధతకు శనివారం ఒక స్పష్టత వచ్చింది.
కల్కి 2: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ సీక్వెల్ షూటింగ్ శంకర్‌పల్లిలో ప్రారంభమైంది. అయితే ఈరోజు కేవలం అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కాంబినేషన్ సీన్స్‌ను మాత్రమే చిత్రీకరిస్తున్నారు. ప్రభాస్ త్వరలోనే ఇందులో పాల్గొంటారు.
ఫౌజీ: హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ పీరియడ్ డ్రామాకు ప్రభాస్ మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీని టాకీ పార్ట్ ఏప్రిల్ 10 కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ చిత్రాన్ని దసరా 2026కి విడుదల చేయడానికి నిర్మాతలు పట్టుదలగా ఉన్నారు.
స్పిరిట్: సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న ‘స్పిరిట’ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోందన్న వార్తల్లో నిజం లేదు. ‘ఫౌజీ’ టాకీ పార్ట్ అయ్యాక మాత్రమే ప్రభాస్ ఈ సెట్స్‌లోకి అడుగుపెడతారు. ఇప్పటివరకు ఏ సినిమా ముందొస్తుంది, ఏది వెనుకొస్తుందనే అనుమానాలకు తాజా లైనప్‌తో తెరపడింది. గత నెలలో విడుదలైన ప్రభాస్ మూవీ రాజాసాబ్ బాక్సాఫీసు వద్ద అట్టర్‌ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే. దాన్ని పూడ్చుకోవడానికి కల్కి 2, ఫౌజీ, స్పిరిట్‌పై ప్రభాస్ దృష్టిపెట్టారు. అంతేకాకుండా, ఆయా సినిమాలకు డేట్లు ఇవ్వడంలో చాలా స్మార్ట్‌గా వ్యవహరించినట్లు తెలిసింది. వచ్చే మూడు, నాలుగు మాసాలు పూర్తిగా షూటింగ్లపైనే దృష్టి పెట్టాలని ప్రభాస్ భావిస్తున్నారు.
ప్రభాస్ సినిమాలపై గందరగోళానికి తెర
- Advertisement -


