Homeసినిమా‘బైకర’ కోసం పూర్తిగా మారిపోయిన శర్వానంద్

‘బైకర’ కోసం పూర్తిగా మారిపోయిన శర్వానంద్

- Advertisement -

హైదరాబాద్: ఇటీవల సంక్రాంతి సందర్భంగా విడుదలైన ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాతో చాలాకాలం తర్వాత హీరో శర్వానంద్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు శర్వానంద్ నటించిన మరో తాజా చిత్రం ‘బైకర’ విడుదలకు సిద్ధమవుతోంది. ఒకప్పుడు ‘అఖండ’ దెబ్బకు వాయిదా పడిన ఈ సినిమా… ఏప్రిల్ మూడవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో, యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా మీద అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇండియాలోనే మొట్టమొదటి పూర్తిస్థాయి మోటోక్రాస్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా కోసం, మునుపెన్నడూ లేని విధంగా ఫిజికల్ మేక్ ఓవర్ అయ్యాడు శర్వానంద్. ఈ సినిమా కోసం శర్వా పడ్డ శ్రమ అంతా ఇంతా కాదు. తాజాగా విడుదలైన ట్రాన్స్‌ఫర్మేషన్ వీడియో, అలాగే ఫోటోలు చూస్తే… శర్వా ఈ సినిమా కోసం తన బాడీ లాంగ్వేజ్ పూర్తిగా మార్చేసుకున్నట్టు అర్థమవుతుంది. లుక్ కోసమే కాకుండా, ఒక ప్రొఫెషనల్ రేసర్ బాడీ ఎలా ఉండాలో దానికి తగ్గట్టు అత్యంత క్రమశిక్షణతో కూడిన శిక్షణ పొందినట్లు తెలుస్తోంది. రేసింగ్ ట్రాక్ మీద హై-టార్క్ బైక్‌లను నియంత్రించడానికి అవసరమైన శారీరక దృఢత్వం కోసం, ఆయన ఎన్నో పవర్ డ్రిల్స్, కోర్ స్టెబిలైజేషన్ వంటి కఠినమైన వర్కౌట్స్ చేశారని తెలుస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు