Homeఆంధ్రప్రదేశ్మద్యం ధరల సవరణపై కసరత్తు

మద్యం ధరల సవరణపై కసరత్తు

- Advertisement -

విశాలాంధ్ర – సచివాలయం: రాష్ట్రంలో ఎక్సైజ్ విధానాల సవరణ, ఆదాయ పెంపుపై సోమవారం అమరావతిలో మంత్రివర్గ ఉపసంఘం ఉన్నత స్థాయి సమీక్ష జరిపింది. మంత్రులు కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ యాదవ్, గొట్టిపాటి రవికుమార్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో మద్యం విక్రయాలు, లైసెన్స్ ఫీజుల మార్పులు, దుకాణాల పునర్విభజనపై కీలక చర్చలు జరిగారు. అంతర్జాతీయంగా రవాణా, ముడిసరుకుల వ్యయం పెరిగిన నేపథ్యంలో బీరు, మద్యం ధరల సవరణపై అధికారులు నివేదికలు సమర్పించారు. రాష్ట్రంలో బీరు కొరత లేకుండా సరఫరాను పెంచేందుకు తయారీ సంస్థలకు ప్రోత్సాహకాలు ఇవ్వడం, ఎయిర్‌పోర్టుల్లో విక్రయ కేంద్రాల ఏర్పాటు, డిజిటల్ పేమెంట్స్ బలోపేతం వంటి నూతన విధానాల ద్వారా వ్యవస్థలో పారదర్శకత పెంచడంతో పాటు కొత్త పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు