బాంకో: ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో మాలి దేశ రక్షణ శాఖ మంత్రి సాదియో కమరా దుర్మరణం చెందారు. దేశ రాజధాని బాంకోకు సమీపంలో గల సాదియో నివాసంపై దాడి జరిగింది. ఉగ్రవాదుల దాడిలో గాయాలపాలైన రక్షణ మంత్రి ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వ ఛానల్ నిర్ధారించింది. మిలిటరీ జుంటా అధినేత జనరల్ అసిమి గోయిటాను ప్రస్తుతం సురక్షిత ప్రాంతానికి తరలించారు. చాలారోజులుగా మాలి దేశంలో అýఖైదా, ఐసిస్‌తో పాటు అజావాద్ లిబరేషన్ ఫ్రంట్‌కు చెందిన గ్రూపుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. కటి ప్రాంతంలో ఉన్న రక్షణ మంత్రి ఇంటిపై అల్‌ఖైదా అనుబంధ మిలిటెంట్లు దాడి చేశారని, ఆ దాడుల్లో కమరా కుటుంబానికి చెందిన మరో ముగ్గురు కూడా మృతి చెందినట్లు తెలి సింది. మంత్రి నివాసంపైకి ఆయుధాలతో నిండిన వాహనం దూసుకువచ్చిందని, ఓ సూసైడ్ అటాకర్ ఆ వాహనాన్ని నడిపినట్లు ప్రభుత్వ ప్రతినిధి ఇసా ఔస్మనే కౌలిబలీ తెలిపారు. మిలిటెంట్లపై ఎదురు కాల్పులు జరిపామని, కొందర్ని హతమార్చామని, కానీ గాయాల వల్ల రక్షణ మంత్రి ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన చెప్పారు.
మాలిలో భారీ ఉగ్రదాడి… రక్షణ మంత్రి మృతి
- Advertisement -
RELATED ARTICLES


