. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
. 11న పోలింగ్… 16న కౌంటింగ్
విశాలాంధ్ర – హైదరాబాద్: రాష్ట్రంలో మరోసారి ఎన్నికల కోలాహలం మొదలయింది. తెలంగాణా మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ మంగళవారం విడుదలయింది. 7 కార్పొరేషన్లు, 116 మునిసిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయని రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుముదుని తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ బుధవారం నుంచి ఈ నెల 30 వరకు నామినేషన్లు స్వీకరణ జరుగుతుందని, 31 న నామినేషన్ల పరిశీలన ఉంటుందన్నారు. మునిసిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఎన్నికల కోడ్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీసులు సైతం ఎక్కడికక్కడ తనిఖీలు ముమ్మరం చేశారు. కాగా ఈ ఎన్నికల్లో 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 2,996 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తుండగా… 8203 పోలింగ్ కేంద్రాలు, ఓట్ల లెక్కింపు కోసం 136 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఎన్నికల ముఖ్య తేదీలు ఇవే…
స్త్ర జనవరి 28 – నామినేషన్ల స్వీకరణ ప్రారంభం
స్త్ర జనవరి 30 – నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ
స్త్ర జనవరి 31 – నామినేషన పరిశీలన
స్త్ర ఫిబ్రవరి 03 – నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు
స్త్ర ఫిబ్రవరి 11 – పోలింగ్
స్త్ర ఫిబ్రవరి 12 – అవసరమైన చోట రీపోలింగ్
స్త్ర ఫిబ్రవరి 13 – ఓట్ల లెక్కింపు
స్త్ర ఫిబ్రవరి 16 ` మునిసిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక… కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక


