Homeతెలంగాణకొత్తగూడెం కార్పొరేషన్‌పై సీపీఐ పట్టు

కొత్తగూడెం కార్పొరేషన్‌పై సీపీఐ పట్టు

- Advertisement -

. 50, 43 డివిజన్ల నుంచి 110 కుటుంబాలు పార్టీలో చేరిక
. అభివద్ధికి ప్రజల సహకరిస్తే కార్పొరేషన్ సీపీఐ కైవసం: జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా

విశాలాంధ్ర – కొత్తగూడెం: కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో సీపీఐ రోజు రోజుకు పట్టు సాధిస్తోంది. మునిసిపాలిటీని కార్పొరేషన్‌గా మార్చడంలో విజయం సాధించిన స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుపై ప్రజల్లో అభివృద్ధి ప్రదాతగా నమ్మకం పెరిగింది. దీంతో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీపీఐలో చేరికలు భారీగా పెరిగాయి. గడిచిన మునిసిపల్ ఎన్నికల్లో బీఆరఎస్ ప్రభంజనంలోనూ 8 ప్రధాన వార్డులలో సీపీఐ ఒంటరిగా పోటీ చేసి విజయం సాధించి సత్తాచాటింది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ రాష్ట్ర వ్యాప్త పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీతో జతకట్టి సీపీఐ అభ్యర్థిగా కూనంనేని 26 వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. అనంతరం కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలతో పాటు సుజాతనగర్ మండలంలో సీపీఐ మరింత బలం పెంచుకుంది. ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్ పాషా గడపగడపకు పరిచయాలు, అతని సేవా కార్యక్రమాలతో వందలాది మంది ఇతర పార్టీల నుంచి సీపీఐలో చేరారు. గత మునిసిపాలిటీ కాస్త ఈ ఎన్నికల్లో కార్పొరేషన్‌గా అవతరించింది. దీంతో సహజంగా ఈ నియోజకవర్గంలో బలం ఉన్న సీపీఐ కలిసి వచ్చే పార్టీలు, సంఘాలతో ఈ ఎన్నికల్లో పోటీ చేసి తొలి కార్పొరేషన్ పీఠాన్ని అధిష్టించాలని సీపీఐ పావులు కదుపుతోంది. ఎమ్మెల్యేగా ఈ రెండేళ్లలో కూనంనేని చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం, పార్టీ శ్రేణులు అహర్నిశలు కషి చేసి అందిస్తున్న సేవలు కమ్యూనిస్టు పార్టీని మరింత బలోపేతం చేసింది. ఈ నేపథ్యంలో కొత్తగూడెం డివిజన్ పరిధిలో సీపీఐలో చేరికల పరంపర కొనసాగుతోంది. మంగళవారం జిల్లా కార్యాలయం శేషగిరి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కార్పొరేషన్ పరిధిలోని 50, 43 డివిజన్లకు చెందిన 110 కుటుంబాలు పార్టీ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా సమక్షంలో సీపీఐలో చేరడం ఎన్నికల ఊపును పెంచింది. కొత్తగూడెం పట్టణ పరిధిలోని రామా టాకీస్ ఏరియా 50 వ డివిజన్‌కు చెందిన యెర్ర రాజు, తండూరి అరుణ్, కోసరబోయిన రమేష్, అజయ్, సలీం, శ్రీను, చంటి నేతత్వంలో 60 కుటుంబాలు పార్టీలో చేరగా, పాల్వంచ పట్టణంలోని నెహ్రునగర్ 43 వ డివిజన్‌కు చెందిన వెంకటేష్, అవినాష్, ప్రశాంత్, మురళి కృష్ణ, నాగమణి, వెంకటేశ్వర్లు నేతృత్యంలో 50 కుటుంబాలు సీపీఐలో చేరడం గమనార్హం. సాబీర్ పాషా వారందరికీ ఎర్ర కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో సీపీఐకి ఎదురులేదన్నారు. కొందరు కావాలని తమ పార్టీని ఇబ్బందుల్లో పెట్టాలని ప్రయత్నిస్తున్నారని, వారికి స్థానిక ప్రజలే తగిన బుద్ధి చెప్పబోతున్నట్లు స్పష్టం చేశారు. త్వరలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో 60 డివిజన్ల నుంచి ప్రజాదరణ ఉన్న అభ్యర్థులను ఎంపిక చేసి పోటీకి సిద్ధం చేశామన్నారు. ప్రతి కార్యకర్త పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని సాబిర్ పాషా సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దుర్గరాసి వెంకటేశ్వర్లు, సలిగంటి శ్రీనివాస్, వుప్ప్పుశెట్టి రాహుల్, ఎస్.కె.ఫహీమ్, పిడుగు శ్రీనివాస్, యాండ్ర మహేష్, బోయిన విజయకుమార్, దాసరి శ్రీనివాస్, నరేందర్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు