Homeరోడ్డెక్కిన విద్యుత్ మీటర్ రీడర్లు

రోడ్డెక్కిన విద్యుత్ మీటర్ రీడర్లు

- Advertisement -

హామీల అమలుపై నిర్లక్ష్యం సరికాదు

. బాబు, పవన్, లోకేశ్ తీరు దుర్మార్గం
. కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్న ‘కూటమి’
. న్యాయం చేయకుంటే పోరాటాలతో బుద్ధి చెబుతాం: ఈశ్వరయ్య

విశాలాంధ్ర`విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యుత్ మీటర్ రీడర్ల సమస్యలను పట్టించుకోకుండా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మండిపడ్డారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం విద్యుత్ మీటర్ రీడర్స్ ‘చలో విజయవాడ’ నిరసన కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపట్టింది. ధŠర్నాచౌక్ వద్ద ఏర్పాటు చేసిన నిరసన సభకు ఈశ్వరయ్య ముఖ్యఅతిథిగా విచ్చేసి సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4000 మంది మీటర్ రీడర్స్ సమస్యలు పరిష్కరించాలని అనేక రోజులుగా ప్రభుత్వానికి, అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. స్మార్టు మీటర్ల ఏర్పాటుతో ఉపాధి కోల్పోయి వారి జీవన విధానం విచ్ఛిన్నం అవుతోందని, ప్రయత్నాయ మార్గాన్ని చూపి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం ధోరణి అవలంభించడం మంచిదికాదని హితవుపలికారు. గత పదేళ్లుగా పనిచేస్తున్న కార్మికులకు న్యాయం చేయకుండా కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చినా ప్రభుత్వం ఆలోచించికపోవడం సరికాదన్నారు. పెద్దపెద్ద ఉద్యోగాలు కోరుకోవడంలేదని , చిన్నపాటి జీవనోపాధి కల్పించాలని కోరుతున్నారని తెలిపారు. కార్మికుల ఆవేదనను అర్థం చేసుకోకుండా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గమ న్నారు. అనేక రంగాల్లో పనిచేస్తున్న వారిని కూటమి ప్రభుత్వం నిలువునా నయవంచన చేస్తోందని మండిపడ్డారు. ఇప్పటికే వలంటీర్లను, పౌరసరఫరాలు, ఎక్సైజ్‌శాఖలలో పనిచేస్తున్న లక్షలాదిమంది ఉద్యోగాలు తొలగించి బజారున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో బడుగు బలహీనవర్గాల కార్మికులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతోందని, కూ{మి నేతలు చెప్పినట్లుగా ఇప్పటికే ఎనిమిది లక్షలు ఉద్యోగాలు కల్పించాలని, ఆ అడుగులు ఎక్కడా కూడా కనిపించకపోగా ఉన్న ఉద్యోగాలను తొలగించారని చెప్పారు. నిద్రాహారాలు మానేసి రోడ్డుమీద ఉన్న కార్మికులకు త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాలులోగా సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే అన్ని కార్మిక వర్గాలను ఏకంచేసి రాష్ట్రంగా వ్యాప్తంగా ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్ మాట్లాడుతూ… కార్పొరేట్‌లకు కొమ్ముకాసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని, భవిష్యత్తులో కార్మికులు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రధాన కార్యదర్శి ఎస్ .వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్‌కోడ్ వలన పీస్ రేట్ కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు కార్మికుల పాలిట శాపాలుగా మారుతున్నాయని పేర్కొన్నారు. కార్మికుల సమస్యలపై ఈ నెల 12న నిర్వహించే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేసేందుకు కార్మికులందరూ పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. కొండబాబు, ఎం. బాలకాశి, వి.జాన్సన్‌బాబు, కె.ఆం్పునేయులు, లంకా గోవిందరాజులు, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి కె.బ్రహ్మానందరెడ్డి, రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన మీటర్ రీడర్స్ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు