Thursday, November 28, 2024
Homeలౌకిక, సామ్యవాద పదాలు తొలగించం

లౌకిక, సామ్యవాద పదాలు తొలగించం

పిటిషన్లు కొట్టేసిన సుప్రీం

న్యూదిల్లీ : రాజ్యాంగ ప్రవేశికలో లౌకిక, సామ్యవాద పదాలు తొలగించాలని దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు రాజ్యాంగ ప్రవేశిక అంశంపై సోమవారం సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌తో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. రాజ్యాంగ పీఠికలో సామ్యవాద, లౌకిక అనే పదాలు జోడిస్తూ 1976లో చేసిన 42వ సవరణను సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ పదాలు తొలగించాలని కోరుతూ బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి తదితరులు ఈ పిటిషన్లు వేశారు. ఆ సవరణపై పార్ల మెంట్‌లో చర్చే జరగలేదని వారు వాదించారు. ఎమర్జెన్సీ (1975-77) సమ యంలో చేసిన ఈ సవరణల చట్టబద్ధతను ప్రశ్నించారు. ఈ పిటిషన్లపై వాదనలు విన్న సుప్రీంకోర్టు నవంబర్‌ 22న తీర్పు రిజర్వ్‌ చేసి… తాజాగా ఆ పిటిషన్లు కొట్టివేసింది. ఈ పదాలకు వివిధ వివరణ లున్నాయని, వేర్వేరుగా అన్వయించుకుం టున్నారని గత విచారణల్లో సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడిరది. ‘సోషలిజం అంటే అందరికీ సమాన అవకాశాలు ఉండాలని అర్థం. సమానత్వం అనే అంశాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. మీరు దీనిని మరో రకంగా చూడకూడదు. అప్పుడు వేరే అర్థం కూడా వస్తుంది. ఇక లౌకికవాదం అనే పదం కూడా అంతే’ అని ధర్మాసనం స్పష్టంచేసింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు