Homeఅంతర్జాతీయంవారసత్వ సంపద జోలికి వస్తే సహించం

వారసత్వ సంపద జోలికి వస్తే సహించం

- Advertisement -

ట్రంప్‌ అల్లుడి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా బెల్‌గ్రాడ్‌లో ప్రజాందోళన

బెల్‌గ్రాడ్‌: మా చరిత్ర, సాంస్కృతిక వారసత్వం మాకు ఎంతో ముఖ్యం, వాటి జోలికి వస్తే సహించేది లేదంటూ సెర్బియా రాజధాని బెల్‌గ్రాడ్‌ ప్రజలు వీధుల్లోకి వచ్చి తమ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నాడు బాంబు దాడిలో ధ్వంసమైన యుగొస్లేవ్‌ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌ను పడగొట్టి అక్కడ విలాసవంతమైన హోటల్‌ కాంపెక్స్‌ నిర్మించాలన్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ప్రాజెక్టును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంక భర్త జరేడ్‌ కుష్నెర్‌ చేపట్టనుండటంతో మరింతగా మండిపడ్డారు. వందల సంఖ్యలో వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌ పునరాభివృద్ధి కోసం సెర్బియా పార్లమెంటు ఇటీవల ఆమోదం తెలిపింది. దీనిని అత్యవసర ప్రాజెక్టుగా పరిగణిస్తూ అతివేగంగా అనుమతులన్నీ జారీచేసింది. ఈ పరిణామం బెల్‌గ్రాడ్‌ ప్రజలకు కోపం తెప్పించింది. విద్యార్థుల అధ్వర్యంలో భారీ ప్రదర్శన జరిగింది. వాస్తవానికి 1998`99 కొసోవో యుద్ధం ముగించేందుకు అమెరికా నేతృత్వ నాటో జరిపిన బాంబు దాడుల్లో ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌ ధ్వంసమయ్యాయి. 60 ఏళ్ల ఈ కట్టడంతో ప్రజల మనోభావాలు ముడిపడి ఉన్నాయి. అమెరికా దేశాధినేత అల్లుడికి అక్కడ హోటల్‌ కంపెక్స్‌ నిర్మాణానికి తమ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం ప్రజలకు మరింతగా కోపం తెప్పించింది. నేరానికి చట్టబద్ధత కల్పించేందుకు ఈ ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చిందని నిరసనకారులు ఆరోపించారు. చట్టబద్ధంగా భవనాన్ని కూల్చేయగలరు కానీ మేము అందుకు ఒప్పుకోమంటూ హెచ్చరించారు. మా చరిత్ర, సాంస్కృతిక వారసత్వం మాకు ఎంతో ముఖ్యం. దాని జోలికి వస్తే ఊరుకోం అంటూ ప్రభుత్వానికి తేల్చిచెప్పారు. కుష్నెన్‌కు చెందిన అఫినిటీ పార్టనర్స్‌ కంపెనీ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌ స్థలాన్ని 99 ఏళ్ల కోసం 2024లో లీజుకు తీసుకుంది. ఈ ఒప్పందానికి ముందు ఆ ప్రాంతానికి ఉన్న సాంస్కృతిక వారసత్వ సంపద హోదాను అక్కడి అధికారులు రద్దు చేశారు. అయితే మే నెలలో అఫినిటీ పార్టనర్స్‌ ప్రాజెక్టు నిలిచిపోయింది. ఈ స్థలానికి ఉన్న రక్షణను తొలగించేందుకు తప్పుడు పత్రాలు వినియోగించినట్లు ఆరోపణలు రావడంతో, దీనిపై విచారణ మొదలైంది. కాగా, గతేడాది నవంబరులో రైల్వేస్టేషన్‌ వద్ద ఘటనతో అవినీతి పాలన అంటూ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ ఉసిక్‌పై ప్రజలు తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు