Homeసాహిత్యంవిద్యాధర్ కవిత్వమొక మానవీయధార

విద్యాధర్ కవిత్వమొక మానవీయధార

- Advertisement -

పెనుగొండ లక్ష్మీనారాయణ
అరసం, జాతీయ అధ్యక్షులు

“భావోత్తేజ ప్రకంపనల తేనీయధారయే కవిత్వం
మనసులోని భావాలకు ఆ మనిషికీమధ్య
నిత్య సత్యసంఘర్షణాపారవశ్యానికదివశత్వం!
ఛళ్లున చరస్తూ చదివిస్తూ వరిస్తుంది జడత్వం” అని కవిత్వాన్ని గురించి ఆసక్తిగా చెబుతున్న జల్దీ విద్యాధర్‌రావుప్రతిభావంతమైన కవి.
ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రస్తుతం పల్నాడు జిల్లాలో చేరిన గురజాల గ్రామంలో జన్మించిన విద్యాధర్‌కు కవిత్వమంటే ప్రాణం. ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసెస్‌లో ఐఆరఏఎస్ సాధించి, ఉద్యోగం చేసి పదవీవిరమణ చేశారు. విశ్రాంతి జీవితాన్ని సాహితీ సజనకు అంకితం చేస్తున్న అవిశ్రాంత సాహిత్యోద్యమ కార్యకర్త.
విద్యాధర్ తెలుగు సాహిత్యానికి మూడు విధాలైన సేవలను అందిస్తున్నారు.
మొదటిది…వారి తల్లిగారైన విమలాదేవి పేరిట విమలా సాహితీ ఏర్పాటుచేసి సాహిత్య కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నారు.
రెండవది. విమలాసాహితి అనే వెబ్ మ్యాగ·జైన్ను ప్రారంభించి ఎనిమిదిమంది మహిళా సాహితీవేత్తలతో ఒక సంపాదక వర్గాన్ని ఏర్పాటుచేసి వారికి బాధ్యతలు అప్పగించి విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ అంతర్జాతీయ పత్రికలో నన్నూ ఆత్మీయంగా పరిచయం చేశారు. ప్రధాన సంపాదకులు శైలజామిత్రగారికి, వ్యవస్థాపక అధ్యక్షులు జల్దీ విద్యాధర్‌గారికి నా ధన్యవాదాలు.
మూడవది. కవిగా కవిత్వ రచన చేస్తూ ఆంగ్లంలో కూడా అనువాదం చేయించి తన కవిత్వాన్ని ఎల్లలు దాటిస్తున్నారు. తెలుగు కథ, కవిత అంతర్జాతీయ స్థాయిని చేరినా అనువాదాలు లేక ఇతర భాషవారిని నష్టపోతున్నాం. అలాంటిది విద్యాధర్ తన కవిత్వాన్ని ఎల్లలు దాటించడం హర్షణీయం. అవే. అంతరంగపు భాష (వాయిసఆఫ్సోల్), తోటమాలిమాలిమి (దగార్డనర్స్లవ్) కోహినూర్. ముసాఫిర్ కవితాసంపుటాలు.
“కవులు నిరంతరం ప్రజల పక్షాన ఉండాలనేది” వీరి సాహిత్య ప్రణాళిక. వీరి కవిత్వంలో అభ్యుదయ, వామపక్ష దŠక్పథాలు విస్తతంగా చోటుచేసు కున్నాయి. సమతా సౌరభాల నోటిమాటల నేతిబీరల డొల్లచెట్టును పెళ్లగించిన బుల్లిఉడుతా నీకు గులాం/ అన్నారు మాండ్యా విద్యార్థిని మస్కాన్ను అభినందిస్తూ రాసిన “నల్లపావురమా” కవితలో…
“గొంగళిపురుగు” కవిత ఉద్యమావసరాన్ని గుర్తుచేస్తుంది.
“మొండిగోడల మొహంజొదారోలు” కవితను రహదారి విస్తరణలో జీవన సర్వస్వాన్ని కోల్పోయిన బతుకులకు అంకితం చేశారు. శిధిలమైన పురానగరం మొహంజొదారోలో (మౌండఆఫ్దడెడ్) ను గుర్తుచేయడం కవితకు బలాన్ని చేకూర్చింది.
‘ఆదివాసీల ఆర్తనాదాలు’ కవితలో కొండల మధ్యలోయలో పారే ప్రశాంత స్వచ్ఛ సెలయేళ్లు రాబందుల మది కపాలకాంక్షకు కల్మషభరితం అయ్యాయి. ఈనాడు అడవుల్లో లభ్యమయ్యే కోట్లాది రూపాయలు విలువచేసే నిజనిక్షేపా లను కొల్లకొట్టడానికి తరతరాల నుంచి అక్కడే జన్మించి జీవిస్తున్న ఆదివాసీలను పాలకపక్షాల అమానవీయ తోడ్పాటుతో వెళ్లగొట్టే ప్రయత్నాలను తీవ్రంగా నిరసిస్తూ “లేవండి పైకిలేవండి” అని బాధ్యతాయుతంగా పిలుస్తున్నారు విద్యాధర్.
“పేదలరాజ్యం’ ఒక ముఖ్యమైన కవిత పేదలకు ఒక రాజ్యం వుండాలన్న ఆకాంక్షను తీవ్రధ్వనిలో వ్యక్తం చేశారు. “గ్రామం బయట విసిరేసిన కాలనీలు మాకోసం కట్టించినట్టు / పొరంబోకు భూముల్లో చచ్చిన గొడ్లను పారవేసినట్లు/ దుర్జనులే లేని సుదూర నిర్జన ప్రాంతంలో స్వేచ్ఛాస్వరాజ్యం కోరుకుంటున్నారు కవి విద్యాధర్. ఇది దళిత స్వరం. ఆ సమాజమే మనందరి ఆకాంక్ష.
“నేను మునివాహనుడే’ కవితలో కపట నాటక వికటనేతల తలపై నేడు మునివాహనుడు ఆదమరచి ఆవులిస్తే రేపు చెత్తకుండీలో అనాధ బాలుడు అవుతాడనే హెచ్చరికను బాధ్యతతో చేస్తున్నారు.
“ముసాఫిర” సంపుటిలోని రుధిర వారధి ఎరుపెక్కిన కవిత. కష్ణానదీతీరం చూసి ఉప్పొంగిన రాసిన కవిత ఇది. 194751 మధ్య జరిగిన తెలంగాణ సాయుధ పోరాటానికి తన జన్మభూమి గురజాల పరిసర గ్రామం దాచేపల్లి ఎంతో సహకారం ఇచ్చాయి. ఆ పోరాటంలోఈ ప్రాంతానికి చెందినవారు అమరులైనారు. అది గొప్పచరిత్ర “ఆత్మబంధనాలలో ప్రతిఫలించిన సజీవనిధి/ అరాచక రజాకార్ల దౌర్జన్యాలు/ ప్రతిఘటించిన/ పోరాటవీరులను/ క్షేమంగా దరిచేర్చిన పెన్నిధి/ పీడితతాడిత ప్రజల కళ్లల్లో ఎరుపుఝరి” ఆనాటి ఆంధ్ర తెలంగాణ సరిహద్దుకు చెందిన కష్ణానది సాక్ష్యంగా చెప్పిన స్ఫూర్తిమంతమైన కవిత ఇది... “కోహినూర” భావుకతతో నిండిన కవిత. “తోటమాలి మాలిమి”ఒక రసరమ్య గీతిక” నలుగురైదుగురు చూట్టూరాచేరి ఆత్మీయంగా మాట్లాడితే ఓ పూలగుత్తి చేతిలో వుందనిపిస్తుంది. జాతకంలో విచ్చుకున్న వందల వదనాలను చూస్తే పూలరాశుల్ని గుట్టలుగా వరసగా పోసినట్లుంటుంది. కవి ఎపుడూ సమూహానికి సమాజానికి చెందిన వ్యక్తి. అందుకే ఆనంద పారవశ్యం ఈ కవిత్వం నిండా విస్తరించింది. తన ప్రియనేస్తం కొరకు రాసిన “ఒక్కడుచాలు” కవిత మన హదయాలను తాకుతుంది. “కాలు కదపకు మిత్రమా! వెన్నెల బెట్టుకోసం” కవితలు కరోనా కష్టకాలాన్ని కళ్ల ముందుంచాయి. విద్యాధర్‌తో పాటు మనందరం భావించే భాసించే సాహితీసముద్రం కొలకలూరి ఇనాక్ ఏమన్నారోచూద్దాం! డా.జల్దీ విద్యాధర్ తన ప్రేమయిక స్వరం. కవిత్వంలో ఈ ప్రేమవిశ్వ విశాలంగా వ్యాపిస్తుంది. అది స్త్రీపురుషుల అనురాగ దాంపత్య మధురమోహనంగా కనిపిస్తుంది. ప్రేమ విశ్వశాంతి మార్గంగా దర్శనమిస్తుంది. విద్యాధర్ కవిత్వ అంతస్సూత్రాన్ని ఈ వాక్యాలు విశదం చేస్తున్నాయి. విద్యాధర్ మహిళల పట్ల అపూర్వ ఆదరణ, గౌరవాన్ని తన అనేక కవితలలో వ్యక్తం చేశారు. ఆకాశంలో సగం పట్ల విద్యాధర్‌కు ఉన్న అభిమానం ఈ నాలుగు కవితాసంపుటాలలో విస్తతంగా చోటు చేసుకుంది. ఫెమినిస్ట్ కవి అన్నా ఆశ్చర్యంలేదు. కవితారహస్యం తెలిసిన ‘జేవీఆర్ అంటూ తన ముందుమాటలో తెలిపిన ప్రియమిత్రుడు శ్రీరామకవచం సాగర్ చెప్పటం వాస్తవమే. ఆత్మీయ మిత్రుడు బిక్కికష్ణ ఆకాంక్ష విద్యాధర్ ఒక మహాకవిగా ఎదగాలని ఆశిస్తున్నాను’ అనే మాటలతో నేను ఏకీభవిస్తున్నాను. విద్యాధర్‌ను హదయానికి హత్తుకుంటున్నాను. విద్యాధర్ కేవలం కవేకాదు. మంచి సమీక్షకుడు. ఎంతో సహదయతతో దాదాపు 20 కవితాసంపుటాలను సమీక్షించారు. సాంద్రత, గాఢత కలగలిసిన కవిత్వాన్ని సజించే విద్యాధర్ విశ్లేషాత్మకమైన సమీక్షావ్యాసాలను అనేకం రచించారు. తనని స్పందింపజేసిన పుస్తకాల గురించి రాయకుండా వుండలేక రాసిన వ్యాసాలివి. ఆయా రచయితల, కవుల వస్తు శిల్పాల నిర్వహణలో సాధించిన సాఫల్యాన్ని ఈ వ్యాసాల్లో వివరించారు. పాలపిట ్ట ప్రచురణకర్తలు చెప్పిన ఈ మాటలు వాస్తవం. డా.జల్దీవిద్యాధర్‌రావు, సరికొండ నరసింహరాజుతో కలిసి సంపాదకత్వం వహించిన “జీవన అస్తిత్వ పోరాట సంకలనం” యుద్ధంశాంతి (341 మంది ప్రముఖ కవుల కవితాసంకలనం) తెలుగు కవులకు వారు అందించిన విలువైన కానుక. విమలాసాహితి (హైదరాబాద్) సజన కళల వేదిక ప్రచురించిన ఈ సంకలనాన్ని ఆనాడు అగ్రరాజ్యాల ఆధిపత్యపు పోరులో అసువులు బాసిన ఎందరో అమాయకులకు అంకితం చేశారు. ఈనాడు సామ్రాజ్యవాద దేశాలైన అమెరికా, ఇజ్రాయిల్ ఆయిల్ నిక్షేపాలకై ఇరాన్‌పై దుర్మార్గంగా యుద్దం చేస్తుండటం, మొన్న వెనుజులా అధ్యక్షుడిని అతని భార్యతో సహా కిడ్నాప్‌చేసి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవడాన్ని యుద్ధాన్ని వ్యతిరేకించే శాంతికాముకులైన ప్రజలను, కవులను, వేదనకు గురిచేసింది. ఈ సందర్భంలో ఈ సంకలనానికి ఎంతో ప్రాధాన్యత వుంది. ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ రచనలు చేయాల్సిన అవసరాన్ని ఈ సంకలనం సాహితీవేత్తల ముందుంచింది. ఈ సంకలనానికి సహకారం ‘అరసంఆంధ్రప్రదేశ’ అని ప్రకటించిన సంపాదకుల సౌజన్యానికి ధన్యవాదాలు. (అమరావతి సాహితీమిత్రుల నిర్వహణలో 13`2026న గుంటూరులో జరిగిన డాక్టర్ జల్దీ విద్యాధర్‌రావు కవిత్వంపై సాహితీ సమాలోచన చేసిన నా ప్రసంగం)

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు