Homeక్రీడలువివాదంలో హార్దిక్ పాండ్యా!

వివాదంలో హార్దిక్ పాండ్యా!

- Advertisement -

న్యూదిల్లీ: టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వివాదంలో చిక్కుకున్నాడు. ఈ నెల8న అహ్మదాబాద్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్2026 ఫైనల్స్‌లో కివీస్‌పై ఘన విజయం తర్వాత సంబరాల్లో మునిగిపోయిన పాండ్యా ...నరేంద్ర మోదీ స్టేడియంలో తన భుజాలపై జాతీయ జెండాను చుట్టుకుని మైదానమంతా పరుగెత్తుతూ సందడి చేశాడు. అయితే ఆ తర్వాత తన ప్రియురాలు మహికా శర్మతో కలిసి పోడియంపై పడుకుని వేడుకలు చేసుకున్న సమయంలో కూడా జాతీయ జెండాను శరీరంపైనే ఉంచుకోవడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై పూణేకి చెందిన న్యాయవాది వాజిద్ ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూణేలోని శివాజీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఆయన సమర్పించిన ఫిర్యాదులో 1971 నేషనల్‌ఫ్లాగ్ యాక్ట్ సెక్షన్2 ప్రకారం మనం జాతీయ జెండాకు గౌరవం ఇవ్వాలని… మైదానంలో హార్దిక్ ప్రవర్తన జాతీయ పతాకాన్ని అవమానించడమేనని పేర్కొన్నారు. జెండాను ఒంటికి చుట్టుకుని పడుకోవడం, ఆ స్థితిలో అసభ్యంగా ప్రవర్తించడం మువ్వన్నెల జెండా గౌరవాన్ని తగ్గించేలా ఉందని వాజిద్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫిర్యాదుపై పోలీసులు ప్రాథమిక విచారణ జరుపుతున్నారు. సోషల్ మీడియాలో సైతం ఈ ఘటనపై మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు పాండ్యాకు మద్దతుగా నిలుస్తుండగా, మరికొందరు దేశానికి ప్రాతినిధ్యం వహించే ఆటగాళ్లు జాతీయ చిహ్నాల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు