నూర్యకుమార్ యాదవ్
న్యూదిల్లీ: టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్… జట్టు పుంజుకున్న తీరు వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ… దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి తర్వాత జట్టును తిరిగి గాడిలో పెట్టేందుకు తెర వెనుక జరిగిన ప్రయత్నాలను వివరించాడు. “ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ ప్రాక్టీస్ సెషన్లలో అత్యుత్తమ ఫీల్డర్‌కు రూ.10,000 నగదు బహుమతిని ప్రవేశపెట్టారు. ఇది ఆటగాళ్లలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అలాగే, సౌతాఫ్రికాతో ఓటమి తర్వాత మా వీడియో అనలిస్ట్ గత రెండేళ్ల ప్రదర్శనతో కూడిన పది నిమిషాల వీడియోను చూపించారు. బ్యాటర్ల కోసం బాహుబలి పాటతో, బౌలర్ల కోసం ‘ఓ షేరా తీర్ తే తాజ’ పాటతో ఆ వీడియోలను రూపొందించారు. ఇలాంటి చిన్న చిన్న క్షణాలే జట్టును మరింత బలోపేతం చేస్తాయి” అని సూర్య తెలిపాడు. జట్టు వాతావరణం గురించి మాట్లాడుతూ, డ్రెస్సింగ్ రూమ్‌లో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఉంటుందని సూర్య స్పష్టం చేశాడు. తిలక్ వర్మ తన హైదరాబాదీ యాసలో మాట్లాడినప్పుడు అందరం నవ్వు ఆపుకోలేకపోయేవాళ్లం. ఇలాంటివే ఒక జట్టును మైదానం బయట కూడా బలంగా కలిపి ఉంచుతాయి అని సూర్య వివరించాడు.
స్వేచ్ఛగా ఉండటమే మా బలం
- Advertisement -


