టెలఅవివ్: పశ్చిమాసియాలో మరోమారు తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గజాపై ఇజ్రాయిల్ మారణీVAమం సష్టిస్తోంది. మరోపక్క ఇరాన్-అమెరికా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరాన్ మెత్తబడిందో లేదో ఇప్పుడు ఇజ్రాయిల్ మరో దుశ్చర్యకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. వివాదాస్పద భూమి వెస్ట్ బ్యాంక్‌ను విలీనం చేసుకునేందుకు పావులు కదుపుతున్నట్లుగా సమాచారం. వెస్ట్ బ్యాంక్‌ను స్వాధీనం చేసుకునేందుకు నెతన్యాహు ప్రభుత్వ అడుగులు పడుతున్నాయనేందుకు తాజా పరిణామాలే నిదర్శనం. ఇప్పటికే వెస్ట్ బ్యాంక్‌లో అధికారిక భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఇజ్రాయిల్ ప్రారంభించినట్లు సమాచారం. అయితే ఈ చర్యలపై పలస్తీనా, సెటిల్మెంట్ వాచ్‌డాగ్ గ్రూప్‌ల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ ఏడాది ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఎన్నికలు ఎదుర్కోనున్నారు. ఇప్పటికే పలస్తీనా రాజ్య ఏర్పాటును నెతన్యాహు వ్యతిరేకిస్తున్నారు. పలస్తీనా ఏర్పడితే ఇజ్రాయిల్‌కు ముప్పు వాటిల్లుతుందని చెబుతున్నారు. ఇక సంకీర్ణ ప్రభుత్వంలో కూడా చాలా మంది వెస్ట్ బ్యాంక్‌ను స్వాధీనం చేసుకోవడానికే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆ ప్రాంతాలన్నీ ఇజ్రాయిల్ సైనిక నియంత్రణలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల నాటికి వెస్ట్ బ్యాంక్‌ను స్వాధీనం చేసుకోవాలని నెతన్యాహు ప్రభుత్వం యోచిస్తోంది. గత వారం వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను నెతన్యాహు కలిశారు. 3 గంటలు రహస్యంగా సమావేశం అయ్యారు. అయితే వెస్ట్ బ్యాంక్‌ను స్వాధీనం చేసుకోవడాన్ని మొదటి నుంచి ట్రంప్ వ్యతిరేకిస్తున్నారు. అయితే అక్కడ ఇజ్రాయిల్ స్థిరనివాస నిర్మాణం విస్తరించకుండా మాత్రం అడ్డుకోలేక పోయారు. తాజా పరిణామాలను బట్టి చూస్తుంటే వెస్ట్ బ్యాంక్‌ను స్వాధీనం చేసుకునేందుకు అడుగులు పడుతున్నట్లుగా కనిపిస్తోంది.
వెస్ట్ బ్యాంక్‌పై ఇజ్రాయిల్ కన్ను
- Advertisement -
RELATED ARTICLES


