హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ పుట్టినరోజు సందర్భంగా చిరు సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ అందరినీ కదిలిస్తోంది. తన 44 ఏళ్ల వైవాహిక జీవితంలోని తీపి జ్ఞాపకాలను, తన భార్య గొప్పతనాన్ని ఆయన ఈ పోస్ట్‌లో వివరించారు. ‘సురేఖను నా ప్రశాంతత, సపోర్ట్ సిస్టమ్, కుటుంబానికి బలమైన పునాది.
నేను షూటింగ్‌లతో బిజీగా ఉన్నప్పుడు, ఇంటి బాధ్యతలన్నీ తనే భుజాన వేసుకుని కుటుంబాన్ని ఏకం చేసిన వంతెన సురేఖ. నా తల్లిదండ్రులను, తోబుట్టువులను తన సొంతవారిలా చూసుకుంటూ… కోడలిగా కంటే ఒక కూతురిలా వారి మనసు గెలుచుకుంది. లోకం నా సక్సెస్‌ను టాలెంట్ లేదా కష్టం అని అనుకుంటుంది.. కానీ నా ప్రతి విజయంలోనూ సురేఖ వంతు ఉంది. తను ఇంట్లో అన్ని బాధ్యతలు మోసింది కాబట్టే, నేను కెమెరా ముందు ఇంతగా మెరవగలిగాను” అంటూ చిరంజీవి భావోద్వేగానికి గురయ్యారు. తన జీవితాంతం ఆమెకు రుణపడి ఉంటానని చిరంజీవి చేసిన ఈ పోస్ట్ మెగా అభిమానులు ఆకట్టుకుంటోంది.
సురేఖనే నా సర్వస్వం: చిరు
- Advertisement -


