Friday, May 30, 2025
Homeఅంతర్జాతీయం‘స్టార్‌ షిప్‌’ ప్రయోగం మళ్లీ విఫలం

‘స్టార్‌ షిప్‌’ ప్రయోగం మళ్లీ విఫలం

గాల్లో పేలి… సముద్రంలో కూలిన మెగా రాకెట్‌
బ్రౌన్స్‌విల్‌: అమెరికా వ్యాపార దిగ్గజం ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ రూపొందించిన స్టార్‌షిప్‌ మెగా రాకెట్‌ ప్రయోగం మళ్లీ విఫలమైంది. ప్రయోగించిన కొన్ని నిమిషాల్లోనే అది గాల్లోనే పేలిపోయింది. ఇలా జరగడం ఇది వరుసగా మూడవసారి. టెక్సాస్‌, బ్రౌన్స్‌విల్‌లోని వేదిక నుంచి ఈ ప్రయోగం జరిగింది. అయితే 30 నిమిషాల్లో రాకెట్‌ పేలిపోయింది. 123 మీటర్ల పొడవైన ఈ రాకెట్‌ తొలిదశలో బూస్టర్‌ నుంచి విడిపోయి భూమి దిశగా ప్రయాణం మొదలుపెట్టింది. కానీ, స్పేస్‌ఎక్స్‌ కంట్రోలర్స్‌కు బూస్టర్‌తో సంబంధాలు తెగిపోవడంతో సముద్రంలో పడిపోయింది. అయితే స్టార్‌షిప్‌ తన ప్రయాణాన్ని కొనసాగించి అంతరిక్షాన్ని చేరుకుంది. నిర్ణీత కక్ష్యలోకి చేరిన తర్వాత పేలోడ్‌లోని శాటిలైట్లను ప్రవేశపెట్టలేకపోయింది. స్టార్‌షిప్‌ భూ వాతావరణంలోకి ప్రవేశించిన కొద్ది సేపటికి హిందూ మహాసముద్రంలో కూలింది. ఈ ఏడాది జనవరి, మార్చిలోనూ రెండు ప్రయోగాలు విఫలమయ్యాయి. గత రెండు సార్లతో పోల్చితే ఈసారి రాకెట్‌ ఎక్కువ దూరం ప్రయాణించిందని, ఈ వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకుంటామని, తదుపరి మంచి ఫలితం సాధిస్తామని స్టార్‌ఎస్స్‌ పేర్కొంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు