Homeసాహిత్యంహాయి రాగమై పరిమళించి…

హాయి రాగమై పరిమళించి…

- Advertisement -

ఏదో వేళ నీ గురుతుల్లో తేలియాడుతుంటే
ఉన్మత్త స్థితి జాలులా చేరి
ఆకాశపుటంచులపై పడదోసి
పకపక నవ్వి పరిహాసాలాడుతుంది
ఒంటరితనపు బెంగ
దోసిళ్ళతో తోడి
మనోనాళీకంపై విసురుతోంది
ఇపుడు మనసు ఘనీభవించి
విలవిలలాటలో ఉంది
ఒక్కసారైనా పల్లవికావూ
హాయి రాగమై పరిమళించి పాడతాను!
తాళ్లూరి రాధ

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు