Homeజిల్లాలుకర్నూలుచంద్రబాబుతోనే గ్రామాలు అభివృద్ధి

చంద్రబాబుతోనే గ్రామాలు అభివృద్ధి

- Advertisement -

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, మండల ఆర్గనైజింగ్ కార్యదర్శి ముక్కన్న అన్నారు. సోమవారం మండల పరిధిలోని జాలవాడి గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లులాంటివన్నారు. గ్రామాల అభివృద్ధి కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమవుతుందన్నారు.గత వైసీపీ ప్రభుత్వం హయాంలో గ్రామాభివృద్ధిని అప్పటి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల్లోనే గ్రామాలకు మహర్దశ వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సాధికార సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లికార్జున, సొసైటీ ఛైర్మన్ మీసేవ ఆంజనేయులు, బూత్ ఇంచార్జీలు శ్రీనివాసులు, కంబగిరి, నాయకులు మునిస్వామి, భీమన్న, బొగ్గుల నరసన్న, గాబ్రియేల్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు