Homeఆంధ్రప్రదేశ్హైకోర్టును ఆశ్రయించిన సునీల్‌నాయక్

హైకోర్టును ఆశ్రయించిన సునీల్‌నాయక్

- Advertisement -

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : గత వైసీపీ ఎంపీ, ప్రస్తుత ఏపీ శాసనసభ ఉప సభాపతి రఘురామకష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం బీహార్ రాష్ట్రం పట్నాలో విధులు నిర్వహిస్తున్న సునీల్ నాయక్ రఘురామరాజు అరెస్ట్ సమయంలో ఏపీ సీఐడీ అధికారిగా బాధ్యతలు నిర్వహించారు. రఘురామ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన గుంటూరు నగరపాలెం పోలీసులు దర్యాప్తులో భాగంగా సునీల్ నాయక్ కు విచారణ నిమిత్తం అనేక సార్లు నోటీసులు ఇవ్వగా స్పందించకపోవడంతో ఆయనను అరెస్టు చేసేందుకు రెండు రోజుల క్రితం దర్యాప్తు అధికారి దామోదర్ నేతృత్వంలో పోలీసు బృందం బీహార్ రాష్ట్రం పట్నాకు వెళ్లింది. ఆయనను అదుపులోకి తీసుకుని న్యాయస్థానంలో హాజరుపరిచింది. ట్రాన్సిట్ వారెంట్ జారీ చేయాలని పోలీసులు కోరగా, అక్కడి న్యాయస్థానం అరెస్టు సమయంలో నిబంధనలు పాటించలేదన్న కారణాలతో ట్రాన్సిట్ వారెంట్ నివాకరించడంతో పాటు నెల రోజుల పాటు అరెస్టు నుంచి మినహాయింపు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో సునీల్ నాయక్ అరెస్ట్ ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో అరెస్ట్ వారెంట్‌తోనే సునీల్ నాయక్‌ను అరెస్టు చేయాలన్న ఉద్దేశంతో ఏపీ పోలీసులు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపి గుంటూరు కోర్టును అరెస్టు వారెంట్ కోసం ఆశ్రయించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు