విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ఏపీలో ప్రాధాన్య పోస్టుల్లో పని చేస్తున్న 2018 గ్రూప్-1 పరీక్ష ద్వారా ఎంపికయిన అధికారులను ఫోకల్ పోస్టుల నుంచి రిలీవ్ చేయా లని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసు కుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. ఫోకల్ పోస్టుల్లో ఉన్న ఈ అధికారులు వెంటనే తమ తమ సంబంధిత శాఖాధిపతుల వద్ద రిపోర్ట్ చేయాలని సీఎస్ ఆదేశించారు. ఇందుకు సంబంధించిన నివేదికను బుధవారం రాత్రి 7 గంటల లోపల సమర్పించాలని సూచించారు. ఈ క్రమంలో 26 మంది ఆర్‌డీవోలు బదిలీ అయ్యారు. 2018 గ్రూప్-1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై హైకోర్టు ప్రస్తుతం విచారణ చేపడుతోంది. ఈ నేపథ్యంలో ఫోకల్ పోస్టుల్లో కొనసాగుతున్న 2018 గ్రూప్-1 అధికారులను ఇతర ప్రాధాన్యేతర పోస్టులకు బదిలీ చేయాలని హైకోర్టు గత వారం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ ఆదేశాలను ప్రభుత్వం పూర్తిగా అమలు చేయలేదని మంగళవారం హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో చీఫ్ సెక్రటరీని ధర్మాసనం ముందు హాజరు కావాలని ఆదేశించగా, బుధవారం ఆయన కోర్టు ఎదుట హాజరయ్యారు. గురువారం లోగా ఫోకల్ పోస్టుల్లో ఉన్న అధికారులందరినీ బదిలీ చేయాలని ధర్మాసనం సూచించింది. న్యాయస్థానం ఆదేశాల నేపథ్యంలోనే ప్రభుత్వం వెంటనే స్పందించి, ఫోకల్ పోస్టుల్లో పని చేస్తున్న 2018 గ్రూప్-1 అధికారులందరినీ రిలీవ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
2018 గ్రూప్-1 అధికారుల రిలీవ్
- Advertisement -
RELATED ARTICLES


