ఇరాన్‌తో చర్చలకు అమెరికా షరతు
వాషింగ్టన్: శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందం దిశగా అమెరికా-ఇరాన్ మరోసారి చర్చలకు సిద్ధమవుతున్నాయి. రెండు రోజుల్లో ఇరు పక్షాల ప్రతినిధుల మధ్య ఇస్లామాబాద్ వేదికగా సంప్రదింపులు జరగొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే ఈసారి చర్చల కోసం ఇరాన్‌కు అమెరికా రెండు షరతులు విధించినట్లు తెలుస్తోంది. ఇందులో ఒకటి ీVAర్మూజ్ జలసంధికి సంబంధించినదేనని సమాచారం. ఈ మేరకు అమెరికా దౌత్య వర్గాలను ఉటంకిస్తూ ఇజ్రాయిల్ మీడియా కథనం వెల్లడించింది. “రెండో దఫా చర్చల ప్రారంభానికి ముందు అమెరికా రెండు షరతులు పెట్టింది. ీVAర్మూజ్ జలసంధిలో ఎలాంటి ఆంక్షలు లేకుండా దాన్ని పూర్తిగా తెరవాలి. చర్చలకు వచ్చే ఇరాన్ ప్రతినిధులు ఒప్పందంపై నిర్ణయం తీసుకోవడానికి వీలుగా ఐఆర్‌జీసీ నుంచి అనుమతులు తెచ్చుకోవాలి. ఈ రెండు నిబంధనలకు తెÉహ్రాన్ అంగీకరిస్తే శాంతి చర్చలకు తాము సిద్ధమేనని అమెరికా తెలిపింది” అని సదరు మీడియా కథనం తెలిపింది. అయితే, దీనిపై అమెరికా, ఇరాన్ నుంచి అధికారిక ప్రకటనేదీ రాలేదు. కాగా, శాంతి చర్చలకు సంబంధించి ఇరాన్ పాలకవర్గంలో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. చర్చల సమయంలో అమెరికా అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు ఇరాన్ ప్రతినిధుల బృందానికి ఐఆర్‌జీసీ అనుమతినివ్వలేదని తెలిసింది. దీనిపై ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ అసంతృప్తిగా ఉన్నట్లు సదరు మీడియా కథనాలు స్పష్టం చేశాయి. ఈ కారణంగానే ఒప్పందం కోసం ఐఆర్‌జీసీ అనుమతి తీసుకోవాలని అమెరికా రెండో షరతు పెట్టినట్లు తెలిపాయి. పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్ వేదికగా ఇటీవల అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. ఆ వెంటనే ీVAర్మూజ్ జలసంధిని అమెరికా దిగ్బంధించడంతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, రెండోదఫా చర్చల కోసం ఇరాన్‌కు చెందిన సరైన వ్యక్తుల నుంచి తమకు ఫోన్ వచ్చిందని ట్రంప్ తాజాగా వెల్లడించారు. అందుకు తాము కూడా సుముఖంగానే ఉన్నట్లు తెలిపారు. వాషింగ్టన్-తెహ్రాన్ మధ్య కాల్పుల విరమణ అంగీకారం గడువు ఈనెల 21తో ముగియనుంది. ఆలోపే చర్చల ద్వారా శాశ్వత శాంతిఒప్పందం కుదుర్చుకోవాలని ఇరుపక్షాలు కోరుకుంటున్నట్లు తెలిసింది.


