Homeజాతీయంలీక్ చేస్తే పదేళ్ల జైలు… రూ.10కోట్ల జరిమానా

లీక్ చేస్తే పదేళ్ల జైలు… రూ.10కోట్ల జరిమానా

- Advertisement -

చట్ట సవరణకు కేంద్రం కేంద్ర క్యాబినెట్ ఆమోదం!
నూదిల్లీ:
పేపర్ లీకులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన చట్టాన్ని సవరించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన శుక్రవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించినట్లు సంబంధిత వర్గాల సమాచారం. ప్రశ్నపత్రాల లీక్ల ఘటనలో దోషులకు పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.10 కోట్ల వరకు జరిమానా విధించేలా ముసాయిదా బిల్లును రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ బిల్లును క్యాబినెట్ ఆమోదించింది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది. 2024 నాటి ప్రవేశ పరీక్షల (అక్రమ పద్ధతుల నివారణ) చట్టానికి కేంద్రం కీలక సవరణలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చట్టం కింద ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడిన వ్యక్తిగత కేసుల్లో దోషులకు 3-5 ఏళ్ల జైలు శిక్ష, రూ.10లక్షల వరకు జరిమానాను విధిస్తున్నారు. అదే వ్యవస్థీకృత నేరాల్లో అయితే 5-10 ఏళ్ల జైలు శిక్ష, రూ.కోటి వరకు జరిమానా ఉంది. ఈ శిక్షలు, జరిమానాలను భారీగా పెంచుతూ ఇప్పుడు చట్ట సవరణకు పూనుకున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలపై జరిగిన క్యాబినెట్ భేటీలో చర్చలు జరిపారు. అనంతరం ఈ ముసాయిదా బిల్లును క్యాబినెట్ ఆమోదించింది. పేపర్ లీకులపై విచారణకు ఫాస్ట్ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని మోదీ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దిల్లీ న్యాయస్థానంలో తొలి ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటవ్వగా…మరో నాలుగింటిని త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు. ఈ న్యాయస్థానాల పరిధిలో…లీకులకు సంబంధించిన కేసుల విచారణను మూడు నెలల్లో పూర్తిచేసి దోషులకు శిక్ష విధించేలా బిల్లులో ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. వచ్చే వారం ఈ బిల్లును లోక్‌సభ ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు