Homeజాతీయంవిద్యార్థులు ప్రశ్నించకూడదా?: రాహుల్ గాంధీ

విద్యార్థులు ప్రశ్నించకూడదా?: రాహుల్ గాంధీ

- Advertisement -


యూనివర్సిటీలపై ఆగ్రహం వ్యక్తం చేసిన పార్లమెంట్ ప్రతిపక్ష నేత
న్యూదిల్లీ:
నీట్ లీక్‌పై సీజేపీ అధ్వర్యంలో జరుగుతోన్న ఆందోళనలకు దూరంగా ఉండాలని పలు యూనివర్సిటీలు విద్యార్థులను హెచ్చరించడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో జరుగుతోన్న తప్పులను ప్రశ్నించడానికి విద్యార్థులు తమ ప్రజాస్వామ్య హక్కులను వినియోగించుకుంటున్నారన్నారు. వారిని ఆందోళనల్లో పాల్గొన వద్దని హెచ్చరించడానికి మీకెంత ధైర్యం అంటూ మండిపడ్డారు. సమయం వచ్చినప్పుడు ఇలాంటి చర్యలకు ఆయా విశ్వవిద్యాలయాలు జవాబుదారీగా ఉండాల్సి ఉంటుందని హెచ్చరించారు. జంతర్‌మంతర్ వద్ద జరిగే ఆందోళనలపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని…ఎవరూ ఆ ప్రాంతానికి వెళ్లొద్దని దిల్లీ యూనివర్సిటీ, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ, ఐఐటీ మద్రాస్ సహా పలు విద్యాసంస్థలు తమ విద్యార్థులకు సూచించాయి. సోషల్ మీడియాలో నిరసనలకు సంబంధించి ఎటువంటి పోస్టులు చేయొద్దని కోరాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ఈ హెచ్చరిక జారీ చేసినట్లు తెలిపాయి. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ స్పందించారు. విశ్వవిద్యాలయాలు ఇచ్చిన సర్క్యులర్‌పై పలువురు ప్రముఖులు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. ‘విద్యార్థుల గొంతులు అణచివేస్తే వారి భద్రత మరింత ప్రమాదంలో పడుతుంది. మనకు నిజంగా వారి భవిష్యత్తుపై ఆందోళన ఉంటే…మౌనంగా ఉండకుండా విద్యార్థుల ప్రజాస్వామ్య హక్కులకు మద్దతు ఇవ్వాలి’ అని నటి, చిత్రనిర్మాత పూజాభట్ పేర్కొన్నారు. ‘దిల్లీ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థిగా…పార్లమెంట్ సభ్యుడిగా డీయమూ విడుదల చేసిన ఈ ప్రకటనను ఖండిస్తున్నాను. జంతర్ మంతర్ వద్ద ప్రదర్శనలు చట్టవిరుద్ధమని ఎవరు ప్రకటించారు? ఇలాంటి విషయాల్లో తప్పుడు ప్రచారాలు చేయడం సిగ్గుచేటు’ అని ఎంపీ దీపేందర్ హుడా పోస్ట్ పెట్టారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు