Friday, March 6, 2026
Homeసినిమా109 సెంటర్లలో 50 రోజులు

109 సెంటర్లలో 50 రోజులు

- Advertisement -

‘మన శంకరవరప్రసాద్‌గారు’ బాక్సాఫీస్ బరిలో భారీ విజయం


హైదరాబాద్: ఈ ఏడాది సంక్రాంతికి ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్రంతో బాక్సాఫీస్ బరిలో కథానాయకుడు చిరంజీవి భారీ విజయాన్ని అందుకున్నారు. ఇప్ప్పుడీ సినిమా మరో మైలురాయిని అధిగమించింది. ప్రస్తుతం ఓటీటీల ప్రభావంతో థియేట్రికల్ రన్ రెండు మూడు వారాలకే పరిమితమైపోతున్న ఈ తరుణంలో… ఈ సినిమా 109 సెంటర్లలో విజయవంతంగా 50రోజులు పూర్తి చేసుకున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. వినోదభరిత కుటుంబ కథా చిత్రంగా ముస్తాబైన ఈ సినిమాని అనిల్ రావిపూడి తెరకెక్కించారు. దీంట్లో చిరుకు జోడీగా నయనతార నటించగా… హీరో వెంకటేశ్ ప్రత్యేక పాత్రలో అలరించారు. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు