విశాలాంధ్ర నందిగామ:-ప్రసిద్ధ తెలుగు రచయిత శ్రీ కొడవగంటి కుటుంబరావు 116వ జయంతిని స్థానిక గ్రంథాలయం నందు గ్రేడు 2 గ్రంథాలయ అధికారి అల్లూరి రామచంద్రుడు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి మంగళవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొడవటి గంటి కుటుంబరావు 12 వేలకు పైగా వ్యాసాలు రాసి ఎంతో ప్రసిద్ధ రచయితగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారని ఆయన రాసిన రచనాలలో ముఖ్యంగా జీవితం చదువు అనే నవలలు అద్దె కొంప షావుకారు సుబ్బయ్య మొదలైన కథానికాలు సినిమా సమీక్షలు సినిమాలకు వ్యాసాలు రాశారని అలాగే సంగీతం ఫోటోగ్రఫీ సినిమాలు అంటే ఆయనకు ఎంతో మక్కువ అని పేర్కొన్నారు 1952 లో చందమామ పుస్తకానికి సంపాదికుడుగా చాలా కాలం పని చేశారని 2009లో కుటుంబరావు శతజయంతి ఉత్సవాలు సాహితీ మిత్రులు ఘనంగా నిర్వహించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయ పాటకులు విరివిగా పాల్గొన్నారు….
ఘనంగా ప్రసిద్ధ తెలుగు రచయిత కొడవటిగంటి కుటుంబరావు 116 వ జయంతి
- Advertisement -
RELATED ARTICLES


