Homeఆంధ్రప్రదేశ్స్పా ముసుగులో వ్య‌భిచారం 12 మంది అరెస్టు

స్పా ముసుగులో వ్య‌భిచారం 12 మంది అరెస్టు

- Advertisement -

విశాలాంధ్ర – రాజ‌మండ్రి సిటీ :  స్థానిక ప్ర‌కాశ్  న‌గ‌ర్ లో ప్రియాంక గార్డెన్స్  ఎదురుగా గ‌ల ఫెద‌ర్ ట‌చ్ అండ్ స్పా లో  అసాంఘిక కార్య‌క‌లాపాలు జ‌రుగుతున్నాయ‌న్న స‌మాచారం మేర‌కు ఆదివారం రాత్రి స్పాను ఆక‌స్మిక త‌నిఖీ చేసి ముగ్గురు నిర్వాహ‌కుల‌ను, న‌లుగురు విటుల‌ను , ఐదుగురు బాధిత మ‌హిళ‌ల‌ను అదుపులోకి తీసుకున్న‌ట్లు ప్ర‌కాశ్ న‌గ‌ర్ సిఐ ఆర్.ఎస్‌.కె. బాజీలాల్ తెలిపారు. సోమ‌వారం సాయంత్రం ప్ర‌కాశ్ న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, జిల్లా ఎస్ పి డి. న‌ర‌సింహ కిశోర్‌, సెంట్ర‌ల్ జోన్  ఇన్‌చార్జి డిఎస్ పి వై. శ్రీకాంత్ ఆదేశాల మేర‌కు ఈ ఆక‌స్మిక త‌నిఖీ చేసిన‌ట్లు తెలిపారు. స‌ద‌రు వ్య‌క్తుల‌పై కేసు న‌మోదు చేశామ‌ని , నిర్వాహ‌కుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని ఆయ‌న తెలిపారు. అలాగే ఇలాంటి స్పా ముసుగులో వ్య‌భిచారం చేసే వారిని ఉపేక్షించ‌మ‌ని, అసాంఘిక కార్య‌క‌లాపాలకు పాల్ప‌డే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవ‌డ‌మే కాకుండా వారిపై హిస్ట‌రీ షీట్స్ ఓపెన్ చేస్తామ‌ని ఆయ‌న ఈ సంద‌ర్భంగా హెచ్చ‌రించారు. 

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు