విశాలాంధ్ర- పామిడి (అనంతపురం జిల్లా) : పామిడి పట్టణం నందు మౌలానా అబుల్ కలాం ఆజాద్ 120వ జయంతిని సోమవారం సిపిఐ పార్టీ సీనియర్ నాయకుడు కె.రహీం ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి మొదటి విద్యా మంత్రిగా పనిచేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ గౌరవార్థం ఈ దినోత్సవాన్ని జరుపుతున్నామన్నారు. ఆయన 1888 నవంబర్ 11న అఫ్ఘానిస్తాన్లోని మక్కాలో జన్మించారు. భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్సీ)కు అతి పిన్న వయస్కుడైన ఆజాద్ అధ్యక్షుడుగా గుర్తింపు పొందారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ దూరదృష్టి కారణంగానే దేశంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఏర్పడి, ఉన్నత విద్యకు అత్యున్నత మార్గం ఏర్పడింది. ఆజాద్ దేశంలో ఉన్నత విద్యకు ఊపిరిపోసిన మహనీయునిగా అభివర్ణించారు.దేశ స్వాతంత్య్ర సముపార్జన, దేశ నిర్మాణంలో ఆజాద్ సహకారం అపారమైనదని చెబుతుంటారు. అతనిని స్వతంత్ర భారతదేశ ప్రధాన వాస్తుశిల్పిగానూ అభివర్ణిస్తుంటారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో విద్యా రంగంలో ఆయన చేసిన కృషిని పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని దేశమంతటా జరుపుకుంటారు. 1920లో ఉత్తరప్రదేశ్లోని అలీఘర్లో జామియా మిలియా ఇస్లామియా స్థాపనకు ఏర్పడిన కమిటీలో ఆజాద్ కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత 19345 యూనివర్సిటీ క్యాంపస్ లను న్యూఢిల్లీకి మార్చడంలో ప్రముఖ పాత్ర పోషించారని తెలిపారు. ఈ కార్యక్రమంలోకె.రహీం, బి కే రహీం,తేల్ బాషా, డాబాబాబా,షేక్షా,వళి, రజక్,ఆర్మీ రఫీ, అల్లా,బషీర్, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు
ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్120వ జయంతి వేడుకలు……
RELATED ARTICLES