Thursday, December 12, 2024
Homeఆంధ్రప్రదేశ్రైతాంగం సమస్యలు పై ప్రభుత్వం తక్షణమే స్పందించాలి ….

రైతాంగం సమస్యలు పై ప్రభుత్వం తక్షణమే స్పందించాలి ….

– చోడవరం తహసీల్దార్ కు వినతి పత్రం అందజేసిన ఏ.పి.రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు …

– నకిలీ పురుగు మందులు, ఎరువులు దుకాణదారులు పై తక్షణమే చర్యలు తీసుకోవాలి…

– పెట్టుబడి సహాయం, సాగునీటి వనరులు అభివృద్ధి పరచి, అన్నదాతను అన్ని విధాలా ఆదుకోవాలి …

విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే.11.11.2024ది. అపరిష్కృతంగా ఉన్న రైతాంగం సమస్యలపై తక్షణమే స్పందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, చోడవరం తహసీల్దార్ పి.రామారావుకు సోమవారం ఏ.పి.రైతు సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు సోమవారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ ఆదేశాలు మేరకు పరిష్కారానికి నోచుకోని రైతాంగం సమస్యలను మండల స్థాయి అధికారులు ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ప్రైవేటు దుకాణాల్లో అధిక ధరలకు అమ్ముతున్నారని, వీరివలన పంటలు నష్టంతో బాటు, పెట్టుబడులు ఎక్కువై రైతన్నలు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయారని తెలిపారు. ప్రైవేటు ఎరువులు, పురుగు మందులు దుకాణాలపై అధికారులు తనిఖీలు కరువయ్యాయని, దీంతో ఎరువులు దుకాణదారులు ఆగడాలు ఎక్కువయ్యాయని తెలిపారు. నకిఃలీలః పై ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేశారు. రైతాంగం పై సవతి తల్లి ప్రేమ చూపుతున్న కూటమి ప్రభుత్వం అధికారం రాక ముందు ఒక మాట, అందలమెక్కాక ఒక మాట ఆడుతూ రైతు కుటుంబాల జీవితాలతో ఆడుకుంటున్నారని అన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లో ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ పెట్టుబడులు ఎక్కువై రైతాంగం నానా ఇబ్బందుల్లో వున్నను, నేటికీ ప్రభుత్వ సహాయం అందక దిక్కుతోచని స్థితిలో వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది అని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులు సుజల స్రవంతి పూర్తి చేసి అభివృద్ధి చర్యలు చేపట్టాలన్నారు. సాగునీటి చెరువులు క్రింద లక్షలు ఎకరాలు సారవంతమైన భూములుండగా, సాగు నీరందక వర్షాధారంగా మాత్రమే పంటలు పండి0చాల్సి వస్తోందన్నారు. ఉత్తరాంధ్ర లో ఎన్ని సాగునీటి వనరులు వున్నప్పటికీ వాటి అభివృద్ది పై పాలకులు, ప్రభుత్వ అధికారులు తగిన శ్రద్ద చూపకపోవడంతో ఖరీఫ్ లో పంటలు ఎండిపోతున్నాయి అన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ప్రధాన చెరువులు, గెడ్డ వాగులు తదితర సాగునీటి వనరులను అభివృద్ది చేస్తే రెండు పంటలు పండి సస్య శ్యామలం అవుతాయని తెలిపారు. అధికార కూటమి ప్రభుత్వం పెద్దలు, పాలకులు, ఇరిగేషన్ అధికారులు తక్షణమే ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులు అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. రైతాంగం సమస్యలు పై స్పందించని ప్రభుత్వానికి అన్నదాతల ఆక్రోశానికి బలి కాక తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం సభ్యులు, వ్య.కా.సం. సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు