Homeజాతీయం28, 29 తేదీల్లో ఐజేయూ 11వ ప్లీనరీ

28, 29 తేదీల్లో ఐజేయూ 11వ ప్లీనరీ

- Advertisement -

. 34 ఏళ్ల తర్వాత విజయవాడలో
. ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) 11వ ప్లీనరీ సమావేశం ఈ నెల 28, 29 తేదీలలో విజయవాడ (అమరావతి)లో జరగనుంది. ఈ సమావేశాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిస్తారని ఐజేయూ అధ్యక్షుడు కే శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి బల్వీందర్ సింగ్ జమ్ము, కార్యదర్శి డి సోమసుందర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాలకు చెందిన ఐజేయూ అనుబంధ జర్నలిస్టు సంఘాల నుంచి ఎన్నికైన ప్రతినిధులు, ఆయా రాష్ట్రాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ఈ ప్లీనరీలో పాల్గొననున్నట్లు వెల్లడించారు. మీడియా స్వేచ్ఛకు పెరుగుతున్న ముప్పు, జర్నలిస్టుల వృత్తిపరమైన సమస్యలు, ప్రస్తుత మీడియా పరిస్థితులపై ప్లీనరీలో చర్చించి… దాదాపు 10 తీర్మానాలతో జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నారు. అలాగే వచ్చే రెండేళ్లకు కొత్త జాతీయ కార్యవర్గం ఎన్నిక కానుంది. దాదాపు 34 సంవత్సరాల విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఐజేయూ ప్లీనరీ నిర్వహిస్తున్నారు. గతంలో 1992లో విజయవాడలో ఐజేయూ రెండో ప్లీనరీ జరిగింది. ఏపీయూడబ్ల్యుజే ఈ సమావేశాలకు ఆతిథ్యం ఇస్తోంది. సభ ఏర్పాట్లను ఎంపీ కేశినేని శివనాథ్ చీఫ్ పేట్రన్‌గా, సీఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేశ్ కుమార్ అధ్యక్షుడిగా, ఏపీయూడబ్ల్యుజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు ప్రధాన కార్యదర్శిగా ఉన్న రిసెప్షన్ కమిటీ పర్యవేక్షిస్తోంది. ఈ సమావేశాలకు కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరై సందేశాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు