విశాలాంధ్ర -ధర్మవరం; ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఆగస్టు 5వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్నిజిల్లా కేంద్రాలు, రెవిన్యూ డివిజన్లతో పాటు మండల కేంద్రాలలో డిమాండ్స్ డేగా పాటించాలని రాష్ట్రకమిటీ పిలుపు ఇచ్చిందని పట్టణ ఏపీయూడబ్ల్యూజే నాయకులు తెలిపారు. వారు మాట్లాడుతూ ఈ మేరకు రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను జిల్లా కేంద్రంలో కలెక్టర్, డివిజన్ కేంద్రాలలో రెవిన్యూ డివిజన్ అధికారులకు, మండల కేంద్రాలలో తాహసీల్దారుల కార్యాలయం వద్ద నిరసన తెలియజేసి అనంతరం వినతి పత్రాలను అందివ్వాలని కమిటీ పిలుపునిచ్చింది అని తెలిపారు.ప్రతి ఒక్క జర్నలిస్టు డిమాండ్స్ డే లో పాల్గొని సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలని జిల్లా కమిటీ, ధర్మవరం రెవెన్యూ డివిజన్ కమిటీ విజ్ఞప్తి చేశారు.
5న జర్నలిస్టుల డిమాండ్స్ డే గా పాటించాలి.. ఏపీయూడబ్ల్యూజే
- Advertisement -
RELATED ARTICLES


