31 వ వార్డు సత్యసాయి నగర్ లో కరెంటు సమస్య పరిష్కరించిన మంత్రి
విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని 31 వ వార్డు సత్యసాయి నగర్ కాలనీ యందు కొంతకాలంగా ‘లో వోల్టేజి, కరెంట్ సమస్య వల్ల ఇళ్లలోని ఎలక్ట్రానిక్ వస్తువులు, ఎల్ఈడి బల్బులు సరిగా పనిచేయకపోవడం వలన విద్యార్థులు చదువుకోవడానికి ఇబ్బందిగా ఉండడం, రాత్రి వేళల ఎందు కాలనీ వాసులు బయట తిరగాలంటే వీధి లైట్లు సమస్య వలన ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని మంత్రి సత్య కుమార్ యాదవ్ దృష్టికి తీసుకువెళ్లగా సమస్యను విన్న మంత్రి సత్య కుమార్ యాదవ్ తక్షణమే సానుకూలంగా స్పందించి మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు ద్వారా 31 వ వార్డు సత్యసాయి నగర్ కాలనీలో ఒక డిపి ఏర్పాటు చేయాలని ఆదేశించడం వాటి పై వెంటనే మంత్రి ఇంచార్జ్ హరీష్ బాబు డిపి ఏర్పాటు చేయడం దీంతో వార్డు ప్రజలు, విద్యార్థులు, చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. అడిగిన వెంటనే సమస్య పరిష్కారం చేసిన మంత్రికి సత్య కుమార్ యాదవ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు జింకా చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సాకే ఓబులేసు, 31 వార్డ్ సత్యసాయి నగర్ బిజెపి నాయకులు. గాండ్లపర్తి మల్లికార్జున, బాలకర్ణ, శివశంకర్, బండ్లపల్లి రాజు, గిరక నాగేంద్ర, రాజశేఖర్, మహేష్, నబి రసూల్ తదితరులు పాల్గొన్నారు.


