జిల్లా పొగాకు నియంత్రణ సామాజిక కార్యకర్త బి. శ్రీరాములు
విశాలాంధ్ర- అనంతపురం : పొగాకు రహిత సమాజాన్ని నిర్మిద్దాం అని, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కు సహకరించాలని జిల్లా పొగాకు నియంత్రణ సామాజిక కార్యకర్త బి. శ్రీరాములు పేర్కొన్నారు. జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమంలో భాగంగా సోమవారం రుద్రం పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో డా. సంధ్య ఆధ్వర్యంలో పొగాకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ… సిగరెట్టు మరియు ఇతర పొగాకు సంబంధింత ఉత్పత్తుల యొక్క వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి వివరించారు. ప్రజలందరూ మంచి ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని పొగాకు మరియు వాటి ఉత్పత్తులకు దూరంగా ఉండాలని తెలియజేశారు. కార్యక్రమానికి విచ్చేసిన వారందరి చేత పొగాకు వినియోగానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు . పొగాకు వినియోగం వల్ల పర్యావరణ కాలుష్యం అవుతోందని మరియు మనిషి యొక్క ఆయుష్ క్షీణిస్తోందని కావున పొగాకు ఏ రూపంలో వాడినా అది మానవాళి ఆరోగ్యాన్ని క్షీణింప చేస్తుందన్నారు. ప్రభుత్వ మరియు ప్రైవేటు ప్రైవేట్ విద్యాసంస్థల పరిధిలో ఉన్న దుకాణాలలో సిగరెట్ మరియు ఇతర పొగాకు ఉత్పత్తులను అమ్మకూడదని తెలియజేశారు. అతిక్రమించిన వారిపై సి ఒ టి పి ఏ -2003 చట్టం ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది అన్నారు ప్రపంచవ్యాప్తంగా ధూమపానం వినియోగంలో భారతదేశం రెండవ స్థానంలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పొగాకు నియంత్రణ సోషల్ వర్కర్ బి. శ్రీరాములు ,పి హెచ్ ఎన్,ఎం ఎల్,హెచ్, పి,ఎస్, ఏ ఎన్ ఎం, ఆశ లు, ప్రజలు పాల్గొన్నారు
పొగాకు రహిత సమాజాన్ని నిర్మిద్దాం..ఆరోగ్య ఆంధ్ర ప్రదేశ్ కు సహకరిద్దాం
- Advertisement -


