Friday, May 30, 2025
Homeఅంతర్జాతీయం61 బిలియన్‌ డాలర్లు చెల్లిస్తారా…

61 బిలియన్‌ డాలర్లు చెల్లిస్తారా…

‘గోల్డెన్‌ డోమ్‌’పై కెనడాతో ట్రంప్‌
వాషింగ్టన్‌ : ఇజ్రాయిల్‌ తరహాలో అమెరికా ‘గోల్డెన్‌ డ్రోమ’ అనే రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకోబోతోంది. ఈ ప్రాజెక్టుపై కెనడా ఆసక్తిగా ఉంది. దీంతో 61 బిలియన్‌ డాలర్లు చెల్లించాలని కెనడాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సూచించారు. లేదంటే తమ దేశంలో విలీనం కావాలని ప్రతిపాదించారు. అమెరికా 51వ రాష్ట్రంగా కెనడా చేరితే గోల్డెన్‌ డోమ్‌ కోసం ఒక డాలరు కూడా చెల్లించాల్సిన అవసరం ఉండదని, కాదంటే 61 బిలియన్‌ డాలర్లు చెల్లించాలని స్పష్టంచేశారు. రక్షణ వ్యవస్థలో కెనడా భాగస్వామ్యాన్ని తానూ కోరుకుంటున్నప్పటికీ అది అమెరికా 51వ రాష్ట్రంగా జరిగితే బాగుంటుందన్నారు. గోల్డెన్‌ డ్రోమ్‌ రక్షణ వ్యవస్థను 2029 చివరికి అందుబాటులోకి తెస్తామని, ఇందుకోసం 175 బిలియన్‌ డాలర్లు వెచ్చిస్తున్నామని ట్రంప్‌ ‘ట్రూత్‌’లో వెల్లడిరచారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు