Thursday, December 11, 2025
Homeఅంతర్జాతీయం8 ఏళ్ల తర్వాత చైనా, కెనడా చర్చలు

8 ఏళ్ల తర్వాత చైనా, కెనడా చర్చలు

- Advertisement -

బీజింగ్‌: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ అపెక్‌ సదస్సు నేపథ్యంలో కెనడా, జపాన్‌ అధినేతలతో అధికారికంగా సమావేశాలు నిర్వహించారు. అనేక అంశాలపై చర్చించారు. అయితే కెనడా ప్రధాని మార్క్‌ కార్నేతో జిన్‌పింగ్‌ దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత భేటీ అయ్యారు. ఈ మేరకు చైనా మీడియా పేర్కొంది. 2017 నుంచి ఈ దేశాధినేతల మధ్య చర్చలు స్తంభించిపోయాయి. పశ్చిమ దేశాలతో పోల్చుకుంటే కెనడాతో చైనాకు సత్సంబంధాలు లేవు. 2018లో అమెరికా వారెంట్‌పై చైనా టెలికం సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ను వాంకోవర్‌లో అరెస్టు చేసిన తర్వాత రెండు దేశాల మధ్య ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. చైనా స్టీల్‌ దిగుమతులపై అదనంగా 25 శాతం సుంకాన్ని ఈ ఏడాది జులైలో కెనడా ప్రకటించింది. దీంతో కెనడా నుంచి కనోలా (నూనె గింజ) దిగుమతులపై 75.8 శాతం తాత్కాలిక కస్టమ్స్‌ సుంకాన్ని చైనా ప్రకటించింది. అమెరికా సుంకాలతో విరుచుకుపడే క్రమంలో అమెరికా`చైనాకు మధ్య ఒప్పందాల వేళ కెనడా ప్రధానితో జిన్‌పింగ్‌ భేటీకి ప్రాధాన్యత ఏర్పడిరది.
జపాన్‌ ప్రధానితోనూ భేటీ
జపాన్‌కు తొలి మహిళా ప్రధానిగా ఇటీవల ఎన్నికైన సనాయే తకైచీతో జిన్‌పింగ్‌ భేటీ అయ్యారు. చైనా ప్రవర్తన, సెంకాకు దీవుల (డయాయు దీవులుగా చైనా గుర్తిస్తుంది)కు సంబంధించి జిన్‌పింగ్‌తో తకైచీ చర్చించినట్లు జపాన్‌ మీడియా పేర్కొంది. చైనా జైళ్లలో మగ్గుతున్న జపాన్‌ పౌరులను త్వరగా విడుదల చేయాలని కూడా ప్రధాని కోరారని తెలిపింది.
చైనాలో ఉంటున్న జపాన్‌ పౌరులకు సముచిత భద్రత కల్పించాలని జిన్‌పింగ్‌కు తకైచీ విజ్ఞప్తి చేసినట్లు వార్తా కథనాలు వెల్లడిరచాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు