Homeజిల్లాలుశ్రీ సత్యసాయిజనాభా గణన 2027 కు ధర్మవరం రూరల్ లో 95 శాతము పూర్తి.. తాసిల్దార్ సురేష్...

జనాభా గణన 2027 కు ధర్మవరం రూరల్ లో 95 శాతము పూర్తి.. తాసిల్దార్ సురేష్ బాబు

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ ఆదేశాల మేరకు భారత దేశ జనాభా గనన 2027 ప్రకారం మే 18 వ తేదీ నాటికి 95 శాతము పూర్తి చేసినట్లు తాసిల్దార్ సురేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రూరల్ పరిధిలో మొత్తం ఉన్న వి 16,344 కాగా ఇప్పటివరకు జనాభా గణన మా సిబ్బంది అధికారుల ద్వారా 15,667 ఇండ్లు పూర్తి చేయడం జరిగిందని వారు తెలిపారు. హౌస్ వర్డ్స్ లో 11,481(కుటుంబంలో ఉన్నవాళ్లు) కలవన్నారు. ఈ కార్యక్రమం మే 30వ తేదీ వరకు కొనసాగుతుందని, నూరు శాతం పూర్తి చేస్తామని వారు తెలిపారు. ఈ జనాభా గణన లెక్కల కోసం ఎనిమినేటర్స్ 96 మంది సూపర్వైజర్లు 16 మంది తమ విధులలో కొనసాగిస్తున్నారని తెలిపారు. కేవలం గృహ స్థితిగతులు లను మౌఖికంగా కుటుంబం సమక్షంలోనే అడుగుతున్నామని తెలిపారు. మా సిబ్బంది ఆధార్ నెంబరు కానీ బ్యాంకు అకౌంట్ ఖాతా నెంబర్ గాని అడగడం లేదని వారు స్పష్టం చేశారు. కొంతమంది అపోహలకు వెళ్లి మా సిబ్బందికి సహకరించడం లేదని వారు తెలిపారు. మా సిబ్బంది ఎవరైనా ఆధార్ నెంబర్ కానీ బ్యాంకు ఖాతా నెంబర్ గాని అడిగినచో చెప్పవద్దని కూడా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో. హేమలత పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు