విశాలాంధ్ర ధర్మవరం; శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం మండలంలోని తిప్పేపల్లి గ్రామానికి చెందిన హైకోర్టు న్యాయవాది అంజన్ రెడ్డి పై దాడి జరగడంతో రక్త గాయాలతో లాయర్ ని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రి కు తరలించారు. ప్రాథమిక వైద్య చికిత్సలు అనంతరం మెరుగైన వైద్యం కోసం వైద్యులు అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వివరాలకు వెళితే.. న్యాయవాది అంజన్ రెడ్డి మాట్లాడుతూ విధులలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తో మాట్లాడుతుండగా మంత్రి అనుచర వర్గం ఉద్దేశిపూర్వకంగా గొడవకు దిగడం జరిగిందని హైకోర్టు న్యాయవాది బాధను వ్యక్తం చేశారు. తనపై మంత్రి సత్య కుమార్ పీఏ హరీష్ బాబు తో పాటు అనుచరులు దాడి చేయడం జరిగిందని తెలిపారు. తలపై పిడుగుతులు గుద్దుతూ తీవ్రంగా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన ధర్మవరం పట్టణంలో సంచలనం లేపింది. మంత్రి సత్య కుమార్ను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు గాను నాపై కక్ష కట్టి దాడి చేయడం జరిగిందని న్యాయవాది స్పష్టం చేశారు. తనను మంత్రి పిఏ హరీష్ బాబు తో పాటు ప్రణీవ్ యాదవ్ తో పాటు మరో ఆరు మంది మామూలుగా పిలిచి దాడి చేయడం జరిగిందని తెలిపారు. మా పైనే ఫేస్ బుక్ లో ఇతర ఇతరులలో రాస్తావా అంటూ నీవు బతకలేవు చంపుతాం అని బెదిరించడం జరిగిందని తను ఆవేదన వ్యక్తం చేశాడు. తన ఫోను కూడా లాకెళ్లడం జరిగిందని తెలిపారు. నాపై దాడి జరిగిన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. తదుపరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
హైకోర్టు న్యాయవాది అంజన్ రెడ్డి పై దాడి..
- Advertisement -
RELATED ARTICLES


