- Advertisement -
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని సొంత మార్కెట్లో వెళ్లే రహదారిలో కాలువపై కలువట్లు శీతలం కావడంతో వాహనదారులు బాటసారిలు ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. దిమ్మిలు మధ్యలోకి విరిగిపోవడంతో కొంతమంది చిన్న చిన్న ప్రమాదాలకు కూడా గురవుతున్నారు. సంతకు వచ్చే ఎంతోమంది ప్రజలు కొనుగోలు చేయాలంటే దీనిపై వెళ్లక తప్పడం లేదు. ఇక వాహనాలు అయితే ఎక్కడికక్కడ కాలువలోకి పడుతాయేమో అని భయాందోళనకు గురవుతున్నారు. కావున మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి విరిగిన సిమెంటు దిమ్మెలను తొలగించి నూతనవి ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.


