Homeఆంధ్రప్రదేశ్పురాతన నాణాలపై విద్యార్థులకు అవగాహన.. నాగరాజరావు

పురాతన నాణాలపై విద్యార్థులకు అవగాహన.. నాగరాజరావు

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణానికి చెందిన కేహెచ్ నాగరాజరావు పురాతన నాణేలను సేకరించి ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. 200 దేశాలకు సంబంధించిన ఆరువేల నాణ్యాలు, కరెన్సీ నోట్లను నాగరాజు సేకరించడం జరిగింది. ప్రైవేట్ పాఠశాలల్లో ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 45 పాఠశాలలకు పైగా ప్రదర్శనలు చేసినట్లు వారు తెలిపారు. తాను 30 సంవత్సరాలుగా నాణ్యాలు సేకరిస్తున్నానని, విద్యార్థులకు అవగాహన కల్పించడమే నా లక్ష్యము అని వారు తెలిపారు. 100 ప్రదర్శనలు నిర్వహించాలన్న లక్ష్యంతోనే తాను ముందుకు వెళుతున్నానని, జిల్లావ్యాప్తంగా పాఠశాలలకు కళాశాలలకు మున్ముందు అవగాహన కల్పిస్తారని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు