- Advertisement -
విశాలాంధ్ర ధర్మవరం : ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణ మున్సిపాలిటీలోని 40 వార్డులను 48 వార్డులుగా పెంచడం జరిగిందని కమిషనర్ వెంకటరమణయ్య తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పెంచిన వార్డుల జాబితాను పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయం, ఆర్డీవో కార్యాలయం, షాప్ రిజిస్టార్లు, వాడు సచివాలయాల్లో ప్రదర్శించడం జరిగిందని తెలిపారు. ఈ జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే, తగిన సలహాలు సూచనలు ఇవ్వదలుచుకునేవారు మే 24వ తేదీలోపు లిఖితః పూర్వకంగా తెలియజేయాలని తెలిపారు.


