Homeఆంధ్రప్రదేశ్తాగునీటి సరఫరా లేకపోవడంతో విసుగు చెందిన గ్రామస్తులు ‌‌..

తాగునీటి సరఫరా లేకపోవడంతో విసుగు చెందిన గ్రామస్తులు ‌‌..

- Advertisement -

ఎంపీడీవో కార్యాలయం వద్ద ఖాళీ బిందెలతో నిరసన….

సిపిఐ ముదిగుబ్బ మండలం కార్యదర్శి చల్లా శ్రీనివాసులు
విశాలాంధ్ర ధర్మవరం/ముదిగుబ్బ : ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బ పాత ఊరిలో గత నెల రోజులుగా తాగునీటి సరఫరా లేకపోవడంతో విసుకు చెందిన గ్రామస్తులు గత్యంతరం లేక
మంగళవారం ముదిగుబ్బ ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలు చేత పెట్టి నిరసన వ్యక్తం చేశారు.అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో ఉన్న సిబ్బందిని బయటకు పంపించి
ఆ కార్యాలయానికి తాళాలు వేసి అక్కడే బైఠాయించి ఆందోళన చేస్తూ అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంపై‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముదిగుబ్బ సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు మాట్లాడుతూ కొన్ని నెలలుగా ‌ అధికారులను నాయకులను మాకు నీరు సరఫరా చేయండి అని ప్రాధేయపడుతున్న ఎవరూ పట్టించుకోలేదని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.కావున ఇప్పటికైనా ‌ తక్షణమే నీటి సరఫరా చేయకపోతే‌‌ ప్రతిరోజు ఇక్కడే నిరవధిక దీక్ష చేపట్టి తద్వారా ప్రతి ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా స్థానిక పాత ఊరు మహిళల నిరసనకు సిపిఐ పార్టీ మద్దతు పలికామని తెలిపారు.

ఎంపీపీని అడ్డుకున్న పాత ఊరు గ్రామస్తులు;;;;;;

ఇదిలా ఉండగా అదే సమయంలో ఎంపీడీవో కార్యాలయానికి వచ్చిన ఎంపీపీ ఆదినారాయణ యాదవను కూడా కార్యాలయంలోకి వెళ్లకుండా పాతూరు గ్రామస్తులు అడ్డుకొని తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఆయనపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన ఎంపీపీ తక్షణమే మీకు ఈ రోజే నా సొంత ఖర్చులతో బోరు వేయించి తాగునీటి సౌకర్యం కల్పిస్తానని హామీ ఇవ్వడంతో నిరసనకారులు తమ ఆందోళన విరమించారు, కాగా ముదిగుబ్బ పాత ఊరు గ్రామస్తులు నిర్వహించిన ఈ ఆందోళన కార్యక్రమానికి సిపిఐ నాయకులు ‌చల్లా శ్రీనివాసులు, వైసీపీ నాయకులు ముల్లగూరు ఆనందుతో పాటు టిడిపి పార్టీ సానుభూతిపరులు అన్నమనేని దామోదర్ నాయుడు, చల్లా శంకర్ నాయుడు, తుమ్మల శ్రీనివాసులు , తుమ్మల మధు, హరి కుమార్ తదితరులు తమ మద్దతు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు